Amit Shah (Photo Credit- PTI)

New Delhi, April 26: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని బస్తర్‌ జిల్లాలో మావోయిస్టులు (Maoists) ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేలుడు జరిపారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు భీతావహంగా ఉన్నాయి. దాడిలో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న మినీ బస్సు ముక్కలు ముక్కలు అయింది. రోడ్డు మొత్తం గుంతల మయం అయింది.

దంతెవాడలో మావోయిస్టుల ఘాతుకం, మందుపాతర పేలి 10 మంది జవాన్లు మృతి, సంతాపం వ్యక్తం చేసిన ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బగేల్

దారుణ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌తో మాట్లాడారు. 10 మంది జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి) సిబ్బంది, ఒక డ్రైవర్‌ను బలిగొన్న దంతెవాడ ఘటనలో మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా సహాయం చేస్తుందని ఛత్తీస్‌గఢ్ సీఎంకు హోంమంత్రి హామీ ఇచ్చారు.రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

దంతేవాడ అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఈ ఉదయం డిస్ట్రిక్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ) ప్రత్యేక యాంటీ-నక్సలైట్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఆ ఆపరేషన్‌ ముగించుకుని మినీ వ్యాన్‌లో తిరిగివస్తుండగా మావోయిస్టులు ఐఈడీతో దాడి చేసి వ్యాన్‌ను పేల్చేశారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, వ్యాన్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

వీడియో ఇదిగో, నక్సల్స్ మందుపాతర దాడిలో ముక్కలు ముక్కలైన జవాన్ల జీపు, చిధ్రమైన రోడ్డు, 11 మంది మృతి

ఘటన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ ఐజీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాగా.. భద్రతా బలగాలపై దాడులు చేస్తామని నక్సల్స్‌ పేరుతో గతవారం పోలీసులకు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈలోపే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

జవాన్లు ప్రాణాలను బలిగొంటున్న మావోయిస్టులను వదిలిపెట్టబోమని సీఎం బఘేల్ తేల్చిచెప్పారు. పోరాటం చివరి దశలో ఉందని పేర్కొన్నారు. ఘటనలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

అమరులైన జవాన్ల పేర్లు

1. రామ్‌కుమార్ యాదవ్ - హెడ్ కానిస్టేబుల్

2. టికేశ్వర్ ధ్రువ్ - అసిస్టెంట్ కానిస్టేబుల్ CAF, ధమ్తరి

3. సలిక్ రామ్ సిన్హా - కానిస్టేబుల్, కంకేర్

4. విక్రమ్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్

5. రాజేష్ సింగ్ - కానిస్టేబుల్ (ఘాజీపూర్, యుపి)

6. రవి పటేల్ - కానిస్టేబుల్

7. అర్జున్ రాజ్‌భర్, కానిస్టేబుల్ (CAF)

మిగతా వారి పేర్లు తెలియాల్సి ఉంది