A screengrab of the video. (Photo credits: Twitter/@imvivekgupta)

చత్తీస్‌గఢ్‌లో వందేభారత్ రైలు ట్రయల్ రన్ జరుగుతుండగా ట్రైన్ మీద రాళ్లు విసిరిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ - ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం మధ్య నడవనున్న ఈ రైలు శుక్రవారం ఉదయం విశాఖపట్టణం నుంచి వస్తుండగా బగ్‌బహరా రైల్వే స్టేషన్ వద్ద నిందితులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ రైలుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కానప్పటికీ సీ2-10, సీ4-1, సీ9-78 కోచ్‌ల అద్దాలు ధ్వంసమయ్యాయి. నిందితులు శివకుమార్ బఘేల్, దేవేంద్ర కుమార్, జీతు పాండే, సన్వానీ, అరుణ్ యాదవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రైలుతోపాటు దేశంలోని తొలి వందేభారత్ మెట్రో రైలును కూడా మోదీ ప్రారంభించనున్నారు. ఇది గుజరాత్‌లోని భుజ్ నుంచి అహ్మదాబాద్‌ మధ్య నడవనుంది.

సుత్తితో వందేభారత్ రైలు అద్దాన్ని యువకుడు ఎందుకు పగులగొట్టాడో సమాధానం ఇదిగో..

అలాగే, 20 కోచ్‌లతో వారణాసి-ఢిల్లీ మధ్య పరుగులు పెట్టనున్న తొలి 20 కోచ్‌ల వందేభారత్ రైలును కూడా మోదీ నేడు ప్రారంభిస్తారు. అలాగే, టాటానగర్-పాట్నా, నాగ్‌పూర్-సికింద్రాబాద్, కొల్హాపూర్-పూణె, ఆగ్రా కంటోన్మెంట్-బెనారస్, పూణె-హుబ్బళ్లి మధ్య నడిచే వందేభారత్ రైళ్లను మోదీ ప్రారంభిస్తారు.