Madurai, August 25: సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి. చిన్న పిల్లల పోర్న్ విషయంలో మరింతగా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే జైలుకెళ్లక తప్పదు. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రతీది పరిశీలిస్తున్నారనే సంగతి మరవకండి. అలాంటి సంఘటనే తమిళనాడులో జరిగింది. తిరుప్పరంకుంద్రం సమీపంలోని వలయపట్టికి చెందిన 30 ఏళ్ల వ్యక్తిని మదురై జిల్లా పోలీసులు సోమవారం ఆన్‌లైన్‌లో అశ్లీల వీడియోలను పంచుకున్నందుకు అరెస్టు ( Man Arrested for Sharing Pornographic Videos) చేశారు.
నిందితుడు టైలర్ అయిన పి పళనిగా గుర్తించారు. అతను వాట్సాప్ మరియు ఇమెయిల్ ద్వారా పిల్లల అశ్లీల వీడియోలను (Child Porn) పంచుకున్నట్లు కనుగొనబడింది.నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్ నివేదికల ఆధారంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుండి సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ టీం పిల్లల అశ్లీల విషయాలను ఆన్‌లైన్‌లో పంచుకోవడాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది.
నిందితుడు మే 29 న పిల్లల అశ్లీల వీడియోలను ఇతరులతో పంచుకున్నాడు. మధురై జిల్లా పోలీసుల యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ విభాగం దర్యాప్తు చేపట్టి నిందితులను సోమవారం అరెస్టు చేసింది. పెరుంగుడి పోలీసులు సమాచార సాంకేతిక చట్టం మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.