New Delhi, November 12: భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ (Chief Justice of India Ranjan Gogoi )సారథ్యంలోని సుప్రీంకోర్టు (Supreme Court )ధర్మాసనం వచ్చే వారంలో 3 రోజుల్లో 3 కీలకమైన తీర్పులు ఇవ్వనుంది. రేపు రాఫెల్ రివ్యూ పిటిషన్ల(Rafale review petitions)కు సంబంధించి తీర్పును వెలువరించనుంది. దీంతో పాటుగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సోనియాగాంధీ తనయుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీని 'చౌకీదార్ చోర్ హై' (కాపలాదారే దొంగ) చేసిన వ్యాఖ్యలపై కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును ఇవ్వనుంది.
రాఫెల్ డీల్ (Rafale jets' deal)ను సమర్ధిస్తూ 2018 డిసెంబర్ 14న కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ వేసిన రివ్యూ పిటిషన్లు వేశారు. సీజేఐ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్ ఈ పిటిషన్లపై తీర్పును గత మేలో రిజర్వ్ చేసింది.
చౌకీదార్ చోర్ హై కేసుపై రేపు తీర్పు
Rahul Gandhi had later tendered an unconditional apology to the Supreme Court for his "unintentional, non-willful and inadvertent" linking of the top court order on Rafale, with his "chowkidar chor hai" slogan against Prime Minister Narendra Modi. https://t.co/cOMVdscn7i
— ANI (@ANI) November 13, 2019
రెండో కేసు విషయానికి వస్తే.. రాఫెల్ వ్యవహారంలో 'చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు.. ఈ ఆరోపణలపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి వేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై సుప్రీంకోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. రాఫెల్ వ్యవహారంలో 'చౌకీదార్ చోర్ హై' (Chowkidar Chor Hai) (కాపలాదారే దొంగ) అంటూ ప్రధాని మోడీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పుడు సంబోధన చేశారంటూ ఈ పిటిషన్ దాఖలైంది. అయితే తన వ్యాఖ్యలకు ఆ తర్వాత రాహుల్ బేషరతుగానే క్షమాపణ చెప్పారు.
దీంతో పాటుగా సీజేఐ కార్యాలయం ఆర్‌టీఐ పరిధిలోకి తీసుకురావాలా వద్దా అనే దానిపై కూడా రంజన్ గొగోయ్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం నేడు కీలక తీర్పునివ్వనుంది. దీనిపై తీర్పును గత ఏప్రిల్ 4న రిజర్వ్ చేశారు. అలాటే శబరిమల అయ్యప్ప ఆలయంలో వయసుతో నిమిత్తం లేకుండా మహిళందరికీ ప్రవేశం కల్పిస్తూ 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ వేసిన పిటిషన్లపై రేపు తీర్పు వచ్చే అవకాశం ఉంది.