Delhi Chief Minister Arvind Kejriwal (Photo Credits: IANS)

New Delhi, April 7: దేశ రాజధానిలో కోవిడ్-19 కేసులు (Coronavirus Spread in Delhi) పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని హాట్‌స్పాట్ కేంద్రాలలో ఒక లక్ష మందికి వేగవంతమైన COVID-19 పరీక్షలు నిర్వహించనున్నట్లు మంగళవారం తెలిపారు. ఇందుకోసం ఐదు అంచెల కార్యాచరణ '5T -ప్రణాళికను'  (5T Plan) సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.

5T లలో T అనే అక్షరానికి టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, టీమ్ వర్క్ మరియు ట్రాకింగ్ అనే అర్థాలను ఇచ్చారు. టెస్టింగ్ అంటే పరీక్షలను నిర్వహించడం, ట్రేసింగ్ అంటే అనుమానితుల కోసం వెతకడం, ట్రీట్మెంట్ అంటే వారికి చికిత్స, టీమ్ వర్క్ అంటే అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేయడం, ట్రాకింగ్ అంటే నిరంతర పర్యవేక్షణ. ఈ రకంగా 5టీ ప్రణాళికతో దిల్లీలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కార్యాచరణను రూపొందించినట్లు కేజ్రీవాల్ తెలిపారు.

Here's the update by ANI

దక్షిణ కొరియా  ఇదే తరహా ప్రణాళికను అమలుపరిచి తమ దేశంలో కోవిడ్-19ను నియంత్రించగలిగిందని కేజ్రీవాల్ తెలిపారు. దక్షిణ కొరియాలో మొదటి కేసు జనవరిలోనే నమోదైనప్పటికీ  ఫిబ్రవరి-ఏప్రిల్ వరకు ఆ దేశం మూకుమ్మడిగా వేగవంతమైన పరీక్షలు జరిపి వైరస్ వ్యాప్తి ఒకరి నుంచి ఒకరికి సోకకుండా కట్టడి చేసింది.

దీంతో  ఆ దేశంలో కేసుల సంఖ్య సుమారు 10 వేలకే కట్టడి చేసింది, అలాగే 200 కంటే తక్కువే మరణాలను నమోదు చేసిందని కేజ్రీవాల్ తెలియజేశారు. ప్రతీ ఒక్కరిని గుర్తించి పరీక్షలు నిర్వహించడం ద్వారా వారి నుంచి ఇతరులకు సోకకుండా కట్టడి చేయవచ్చునని కేజ్రీవాల్ చెప్పారు.   భారతదేశంలో 4,421 దాటిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు

నిజాముద్దీన్ మర్కజ్ ఉదంతం ద్వారా దిల్లీలో కోవిడ్-19 కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. కరోనావైరస్ వ్యాప్తిలో మంగళవారం నాటికి దిల్లీ, భారతదేశంలోనే మూడవ స్థానానికి ఎగబాకింది. ఇక్కడ కేసుల సంఖ్య 549కి చేరుకోగా, 7గురు చనిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో కోవిడ్-19 ప్రభావం తీవ్రంగా ఉంది.