Karnataka Lockdown: కర్ణాటకలో 24వ తేదీ వరకు అన్నీ బంద్, సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించిన యడ్డీ సర్కారు, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి, వివాహాలకు కేవలం 50 మందికి మాత్రమే అవకాశం
Lockdown | File Image | (Photo Credit: PTI)

Bengaluru, May 7: కర్నాటకలో కరోనావైరస్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో వైరస్‌ కట్టడి కోసం ఇన్నాళ్లు విధించిన పాక్షిక లాక్‌డౌన్‌ (Karnataka Lockdown) ఫెయిలైందని ఇకపై సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్డ్యూరప్ప ప్రకటించారు.

నిత్యం 50 వేలకు పైగా కేసులు, 400 వరకు మరణాలు సంభవిస్తుండడంతో చివరి అస్త్రంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ (Complete Lockdown Imposed in Karnataka) అమలు చేస్తున్నట్లు సీఎంం యడియూరప్ప తెలిపారు. కోవిడ్‌ కట్టడి కోసం ఏప్రిల్‌ 27 నుంచి మే 12 వరకు విధించిన కరోనా కర్ఫ్యూ వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో మే 10 నుంచి 24వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించారు.

లాక్‌డౌన్‌పై మంత్రులు, అధికారులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. 14 రోజుల లాక్‌డౌన్‌లో అత్యవసర సేవలు మినహాయించి అన్నింటిని బంద్‌ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యడ్డ్యూరప్ప స్పష్టం చేశారు. నిత్యవసర సరుకుల కొనుగోలు కోసం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కరూ బయట కనిపించినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

తమిళనాడులో లాక్‌డౌన్‌, మే 10 నుంచి 24 వరకు లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు తెలిపిన స్టాలిన్ సర్కారు, మధ్యాహ్నం 12వరకు అత్యవసర సేవలకు అనుమతి

అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లా ప్రయాణాలు, బార్లు, పాఠశాలలు, ప్రజా రవాణా, కర్మాగారాలు, అన్ని కార్యాలయాలు, మెట్రో రైల్వే మూతపడ్డాయి. అయితే భవన నిర్మాణ కార్మికులకు మినహాయింపు ఇచ్చారు. విమాన, రైల్వే రాకపోకలపై ఎలాంటి నిషేధం లేదు. వివాహాలకు కేవలం 50 మందికి మాత్రమే అవకాశం కల్పించారు.