Representative Image (Photo Credits: Unsplash)

Kolakata, July 25: పశ్చిమ బెంగాల్ నుంచి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆ రాష్ట్రంలోని యువత కండోమ్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా బెంగాల్ లోని దుర్గాపూర్ గ్రామంలో యువత మెడికల్ షాపుల్లోని నిరోధ్ ప్యాకెట్లు (Condoms Get Youth in West Bengal) కొనుగోలు చేస్తున్నారు. దుర్గాపూర్‌లోని వివిధ ప్రాంతాలైన దుర్గాపూర్ సిటీ సెంటర్, విధాననగర్, బెనచిటి మరియు ముచ్చిపర, సి జోన్ మరియు ఎ జోన్‌లో గర్భనిరోధక వినియోగం పెరిగింది.

దీంతో వారేం (Condoms Addiction) చేస్తున్నారంటే.. వీటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి తెల్లవారి నిరోధ్ ను తీసేసి ఆ నీటిని తాగుతున్నారు. దీంతో కిక్కు (Flavoured Sheath to Get Intoxicated) బాగా ఎక్కుతుందట. అచ్చం మందుబాబుల్లా తూలుతున్నారు. ఇదేదో బాగుందని అందరు నిరోధ్ ప్యాకెట్లు తెచ్చుకుని అదే తీరుగా ప్రయోగాలు చేస్తూ ఒకరిని మించి మరొకరు ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో అక్కడ కండోమ్ ల కొరత ఏర్పడుతోంది.

ఒకసారి వాడిన కండోమ్‌ను రెండోసారి కడిగి వాడుకోవచ్చా, నిపుణులు ఏం చెబుతున్నారు, ప్రతీ పురుషుడు తెలుసుకోవాల్సిన నిజం ఇదే..

కండోమ్స్ ను ఎక్కువ సేపు నీటిలో నానబెట్టడం వల్ల ఆర్గానిక్ మాలిక్యుల్స్ బద్దలై అల్కహాలిక్ కాంపౌండ్స్ గా మారతాయని చెబుతున్నారు. దీంతోనే వారికి అల్కహాల్ తీసుకున్నట్లు పూనకం వస్తోంది. కాలేజీ స్టూడెంట్స్ ఇలాంటి అలవాట్లకు బానిసలు కావడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై స్థానిక అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో యువత ఇలా పెడదారి పడితే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

కండోమ్‌కు కన్నం పెట్టినందుకు 6 నెలలు జైలు శిక్ష, జర్మనీలో తొలికేసు

మూలాల ప్రకారం, ఇటీవలి నివేదికలు దగ్గు సిరప్, పెయింట్, జిగురు మరియు ఆఫ్టర్ షేవ్‌తో పాటు మాదకద్రవ్య దుర్వినియోగం జాబితాలోకి కండోమ్‌లను చేర్చాయి. భారతీయ శిక్షాస్మృతిలో సమస్యను పరిష్కరించడానికి నిర్దిష్ట చట్టాలు లేనందున మాదకద్రవ్యాల దుర్వినియోగదారులపై అభియోగాలు నమోదు చేయలేమని వారి నివేదిక పేర్కొన్నందున పశ్చిమ బెంగాల్ పోలీసులు ఈ అంశంపై ఇంకా వ్యాఖ్యానించలేదు.