UP Assembly Election: కాంగ్రెస్ సంచలన నిర్ణయం, ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లికి అసెంబ్లీ టికెట్ ప్రకటించిన ప్రియాంక గాంధీ, యూపీ ఎన్నికలకోసం ఫస్ట్ లిస్ట్ రిలీజ్‌

Lucknow January 13: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల( Uttar Pradesh assembly election) కోసం 125 మందితో కూడిన తొలి విడత జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లిని(mother of Unnao rape victim) అభ్యర్ధిగా ప్రకటించి అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు ప్రధాన పార్టీలేవీ అభ్యర్ధులను ప్రకటించలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం తొలి విడత ఎన్నికల కోసం పోటీ చేయాల్సిన వారి లిస్ట్ రిలీజ్(First list) చేసింది.

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka gandhi) ప్రకటించిన లిస్ట్‌ లో ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్‌(mother of Unnao rape victim) కూడా ఉన్నారు. ప్రియాంక ప్రకటించిన 125 మంది అభ్యర్థుల్లో 50 మంది (40 శాతం) మహిళా అభ్యర్థులు, మరో 40 శాతం మంది యువత ఉన్నారు. వీరిలో ఆశా కార్యకర్త పూనమ్‌ పాండే(Poonam Pandey), సామాజిక కార్యకర్త సదాఫ్‌ జాఫర్‌ కూడా ఉన్నారు.

UP Assembly Elections 2022: యూపీలో బీజేపీకి షాక్, 13 మంది ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరుతారని బాంబు విసిరిన శరద్‌ పవార్‌, మౌర్యతో పాటు పార్టీని వీడిన మరో ఎమ్మెల్యే

2017లో జరిగిన ఉన్నావ్‌ అత్యాచార ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌(Kuldeep singh) దోషిగా తేలారు. దీంతో 2020లో కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. కాగా, ఈ అమానుష ఘటనపై పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా.. సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ (Yogi adithyanath)ఇంటి ముందు బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఈ కేసు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్నది. ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌పై అత్యాచార ఆరోపణలు రావడంతో, బాధితురాలి తండ్రిని అక్రమాయుధాల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో చిత్రహింసలు పెట్టడంతో ఆయన మరణించారు.