New Delhi, May 07: పెరుగుతున్న ధరలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై మరో పిడుగు పడింది. వంటగ్యాస్ (Cooking Gas) ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ (Cooking Gas) ధర రూ. 50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా పెరిగిన ధరతో సిలిండర్ (Cylinder) ధర రూ. 1052కు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల పెరుగుదలతో పాటు పెట్రోల్ (ష్ట్రాఒఇఏన), డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదవర్గాల ప్రజలకు కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ఈ క్రమంలో పేద వర్గాలుసైతం అధికంగా వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం వారికి పెనుభారంగా మారనుంది.
The price of 14.2 kg Domestic LPG cylinder increased by Rs 50 with effect from today. The domestic cylinder will cost Rs 999.50/cylinder from today.
— ANI (@ANI) May 7, 2022
కొద్దిరోజుల క్రితమే 19 కిలోల వాణిజ్య సిలిండర్ (Commercial gas) ధర పెరిగిన విషయం విషయం తెలిసిందే. దీంతో మే1 నుంచి హైదరాబాద్ లో వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,460 నుంచి రూ. 2,563.50కి చేరింది. ఇక ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వెళ్తున్నాయి ఆయిల్ కంపెనీలు. అయినప్పటికీ సామాన్యులపై భారం తగ్గించేలా కేంద్రం ఎలాంటి చర్యలను తీసుకోవడం లేదు.