New Delhi, July 5: భారతదేశంలో ఒకరోజును మించి మరొకరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 24,850 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 6,73,165 కు చేరింది. నిన్న ఒక్కరోజే 613 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 19,268 కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో అత్యధికంగా దేశవ్యాప్తంగా 14,856 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 4,09,082 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 2,44,814 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Here's the update by ANI:
India reports the highest single-day spike of 24,850 new COVID19 cases and 613 deaths in the last 24 hours. Positive cases stand at 6,73,165 including 2,44,814 active cases, 4,09,083 cured/discharged/migrated & 19,268 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/I2UAKS1zlv
— ANI (@ANI) July 5, 2020
States with most active cases:
#COVID19 India Update:
ప్రపంచవ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే శనివారం రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మొత్తం 24 గంటల్లో 212,326 కేసులు నమోదయ్యాయని తెలిపింది. యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్ మరియు భారతదేశం నుండే పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు WHO పేర్కొంది. అలాగే మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రోజుకి కనీసం 5 వేల చొప్పున కరోనా మరణాలు నమోదవుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య సుమారు 1కోటి 3 లక్షల వరకు ఉండగా, ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 5 లక్షలకు పైగానే మరణాలు నమోదయ్యాయి.