Coronavirus in India | (Photo Credits: PTI)

New Delhi, May 4: భారతదేశంలో రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్-19 కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటి వరకు రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదయితేనే అమ్మో అనుకున్న వేళ, ఇటీవల కాలంగా ఒక రోజులో కనీసం 2 వేలకు కేసులకు తక్కువగా పాజిటివ్ కేసులు నమోదవడం లేదు.  దేశవ్యాప్తంగా నెలకు పైగా లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయంటే కేంద్రం ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిచోట్ల సడలింపులు ఇవ్వడం, కొన్నిచోట్ల తరలింపులు చేయడం చేస్తున్నప్పుడు పరిస్థితులను మరింత ముదరకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి, మార్గదర్శకాలు పక్డ్బందీగా అమలవుతున్నాయా? అనేది చూడాలి. అప్పుడే ఇంతకాలంగా అమలు చేసిన లాక్డౌన్ కు విలువ ఉంటుంది.   మద్యం షాపుల ముందు మందు బాబుల క్యూ, భౌతిక దూరం బేఖాతర్

ఇక కేసుల విషయానికి వస్తే, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 2,573 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య సోమవారం నాటికి 42,836 దాటింది. ఇదే సమయంలో కొత్తగా మరో 83 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1389 పెరిగింది.

ఇప్పటివరకు 11,761 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 29,685 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది

మహారాష్ట్ర రాష్ట్రం కరోనా మహమ్మారి ధాటికి విలవిలలాడుతోంది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈరోజు ఉదయం నాటికి మహారాష్ట్రలో కోవిడ్-19 కేసుల సంఖ్య 11,500 దాటాయి. అలాగే మరణాల సంఖ్య 485కు పెరిగింది. మహారాష్ట్రలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో సుమారు 7,800 పైగా కేసులు, 295 మరణాలు ఒక్క ముంబై నగరంలోనే నమోదయ్యాయి.

అధికారిక గణాంకాల ప్రకారం కరోనావైరస్ వ్యాప్తి తీవ్రత అత్యధికంగా మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ ఈరోజు వరకు 12,974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుజరాత్ లో 5428, దిల్లీ 4549, తమిళనాడు 3023, మధ్యప్రదేశ్ 2942, రాజస్థాన్ 2886, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 2,742 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రాల వారీగా కోవిడ్-19 గణాంకాలు ఇలా ఉన్నాయి:

S. No. Name of State / UT Total Confirmed cases (Including 111 foreign Nationals) Cured/Discharged/Migrated Death
1 Andaman and Nicobar Islands 33 32 0
2 Andhra Pradesh 1650 524 36
3 Arunachal Pradesh 1 1 0
4 Assam 43 32 1
5 Bihar 517 125 4
6 Chandigarh 94 19 0
7 Chhattisgarh 57 36 0
8 Delhi 4549 1362 64
9 Goa 7 7 0
10 Gujarat 5428 1042 290
11 Haryana 442 245 5
12 Himachal Pradesh 40 34 1
13 Jammu and Kashmir 701 287 8
14 Jharkhand 115 22 3
15 Karnataka 642 304 26
16 Kerala 500 401 4
17 Ladakh 41 17 0
18 Madhya Pradesh 2942 798 165
19 Maharashtra 12974 2115 548
20 Manipur 2 2 0
21 Meghalaya 12 0 1
22 Mizoram 1 0 0
23 Odisha 163 60 1
24 Puducherry 8 5 0
25 Punjab 1102 117 21
26 Rajasthan 2886 1356 71
27 Tamil Nadu 3023 1379 30
28 Telengana 1082 490 29
29 Tripura 16 2 0
30 Uttarakhand 60 39 1
31 Uttar Pradesh 2742 758 45
32 West Bengal 963 151 35
Total number of confirmed cases in India 42836* 11762 1389

భారతదేశంలో ప్రస్తుతం మూడవ విడత లాక్డౌన్ అమలులో ఉంది. COVID-19 వ్యాప్తి దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో మార్చి 24 నుండి దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం లాక్డౌన్ 3.0 లో దేశంలోని ఆయా ప్రదేశాల్లో కేసుల తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్ మరియు గ్రీన్ అనే మూడు జోన్లుగా విభజించించి తదనుగుణంగా లాక్డౌన్ ఆంక్షల నుంచి కొన్ని సడలింపులు ప్రకటించింది.