![](https://test1.latestly.com/wp-content/uploads/2021/12/AIIMS-Director-Dr-Randeep-Guleria.jpg)
New Delhi, Oct 4: రెండేళ్ల కిందట వైరస్ బారినపడి పూర్తిస్థాయిలో కోలుకున్న చాలామంది ఇప్పుడు పలు సమస్యలతో బాధపడుతున్నారని ఢిల్లీ ఎయిమ్స్ సర్వే తెలిపింది. వారిని పోస్ట్ కొవిడ్ సమస్యలు వెంటాడుతున్నాయి. గతంలో కరోనా సోకి కోలుకున్నవారంతా రెండేళ్ల కిందట కిలోమీటర్ల కొద్దీ నడవగా.. ఇప్పుడు 400 నుంచి 500 మీటర్ల నడిస్తేనే తీవ్రంగా అలసటకు (people’s breathing is suffocating) గురవుతున్నారు. అంతేకాకుండా నిద్రలేమి, జుట్టరాలడం, శ్వాస సరిగా ఆడకపోవడం, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) అధ్యయనంలో తేలింది.
మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో (Delhi AIIMS survey revealed) తేలింది. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) కొవిడ్ అనంతర పరిస్థితులపై ఓ సర్వే ద్వారా నిర్వహించిన అధ్యయంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనం DovPress మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైంది.ఈ అధ్యయనంలో వైద్యులు దేశంలో పలు ప్రాంతాల నుంచి కరోనా మొదటి, రెండో వేవ్‌లో వైరస్ బారినపడిన ఎంపిక చేసిన రోగులతో వారి దినచర్యపై చర్చించారు.
2020-2021 సమయంలో ఆసుపత్రిలో చేరిన తర్వాత వీరందరి జీవితం పూర్తిగా మారినట్లు గుర్తించారు. కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తి ఇప్పుడు ఎనిమిది గంటలు పని చేయడం కష్టతరంగా మారినట్లు కనుగొన్నారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పర్యవేక్షణలో ఈ అధ్యయనం జరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 1800 మందిని ఎంపిక చేసి, వారితో ఫోన్‌లో సంభాషించారు.
ప్రస్తుత దినచర్యకు సంబంధించి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు ఆరా తీశారు. ఇందులో 79.3శాతం అలసట, 33.4శాతం మంది కీళ్ల నొప్పులు, 29.9శాతం గౌట్, 28శాతం జుట్టు రాలడం, 27.2శాతం తలనొప్పి, 25.3శాతం శ్వాస ఆడకపోవడం, 25.30శాతం మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. కరోనా బారిన పడిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చిందని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో చాలా యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
అధ్యయనం ప్రకారం.. పోస్ట్ కొవిడ్ 12 వారాల్లో 12.8 శాతానికి తగ్గింది. మహిళలు, వృద్ధాప్యం, ఆక్సిజన్ తీసుకోవడంలో సమస్యతో పాటు ఇప్పటికే ఉన్న ఇతర వ్యాధులు పోస్ట్ కోవిడ్‌కు కారకాలని వైద్యులు పేర్కొంటున్నారు. కరోనాకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు అభివృద్ధి చేయడంతో పాటు సంక్రమణను నిరోధించడమే కాకుండా.. పోస్ట్ కోవిడ్‌గా అనుమానించిన వారిలో 39శాతం మందిలో లక్షణాలు పెరుగకుండా కాపాడబడినట్లు అధ్యయనం ధ్రువీకరించింది.