Coronavirus in India | (Photo Credits: PTI)

New Delhi, May 9: భారతదేశంలో రోజురోజుకు పెరుగుతూ పోతున్న పాజిటివ్ కేసులతో కరోనా బాధితుల సంఖ్య 60 వేలకు చేరువయింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 3,320 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 59,662 దాటింది. నిన్న ఒక్కరోజే 95 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1981 కి పెరిగిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.

నిన్న దేశవ్యాప్తంగా 1325 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 17,846 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 39,834 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో మూడవ విడత లాక్డౌన్ అమలులో ఉంది. అయితే లాక్డౌన్ విధించి నేటికి 45 రోజులు కావస్తుంది. ఈ లాక్డౌన్ వలన దేశంలోని చాలా ప్రాంతాలలో కరోనావైరస్ వ్యాప్తి సమర్థవంతంగా కట్టడి చేయబడింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు అరుణాచల్ ప్రదేశ్, గోవా మరియు మణిపూర్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్-నికోబార్ పూర్తిగా కోవిడ్-19 రహిత ప్రాంతాలుగా మారాయి.. భారతదేశ COVID-19 యొక్క రికవరీ రేటు 29.36% గా మెరుగైన స్థితిలో ఉంది. దేశవ్యాప్తంగా 216 జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో 80 శాతం జిల్లాలు కోవిడ్-19 రహితం అవుతున్నాయని ప్రకటించిన మంత్రి ఈటల

మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతూ పోతున్నాయి. ఈరోజు ఉదయం వరకు ఉన్న కోవిడ్-19 గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా 19,063 కేసులు, 731 మరణాలు, అటు తరువాత గుజరాత్‌లో 7,402 కేసులు, 449 మరణాలు, దిల్లీలో 6318 కేసులు, 68 మరణాలు, తమిళనాడులో 6009 కేసులు, 40 మరణాలు నమోదయ్యాయి.

అన్ని రాష్ట్రాలు మరియు యూటీల వారీగా కోవిడ్-19 గణాంకాలు ఇలా ఉన్నాయి

S. No. Name of State / UT Total Confirmed cases (Including 111 foreign Nationals) Cured/Discharged/Migrated Deaths ( more than 70% cases due to comorbidities )
1 Andaman and Nicobar Islands 33 33 0
2 Andhra Pradesh 1887 842 41
3 Arunachal Pradesh 1 1 0
4 Assam 59 34 1
5 Bihar 571 297 5
6 Chandigarh 150 21 1
7 Chhattisgarh 59 38 0
8 Dadar Nagar Haveli 1 0 0
9 Delhi 6318 2020 68
10 Goa 7 7 0
11 Gujarat 7402 1872 449
12 Haryana 647 279 8
13 Himachal Pradesh 50 38 2
14 Jammu and Kashmir 823 364 9
15 Jharkhand 132 52 3
16 Karnataka 753 376 30
17 Kerala 503 484 4
18 Ladakh 42 17 0
19 Madhya Pradesh 3341 1349 200
20 Maharashtra 19063 3470 731
21 Manipur 2 2 0
22 Meghalaya 12 10 1
23 Mizoram 1 0 0
24 Odisha 271 63 2
25 Puducherry 9 6 0
26 Punjab 1731 152 29
27 Rajasthan 3579 1916 101
28 Tamil Nadu 6009 1605 40
29 Telengana 1133 700 29
30 Tripura 118 2 0
31 Uttarakhand 63 46 1
32 Uttar Pradesh 3214 1387 66
33 West Bengal 1678 364 160
Total number of confirmed cases in India 59662* 17847 1981

ఈ సందర్భంగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు మాట్లాడుతూ "ఇకపై మనమందరం కూడా కరోనావైరస్ తో సహజీవనం చేస్తూనే ఎలా జీవించాలో నేర్చుకోవాలి. ఈ పోరాటం చాలా కఠినమైనది. దీనికి అందరి సహకారం అవసరం" అని పేర్కొన్నారు. కరోనావైరస్ ముప్పు నుండి నిరంతరం కాపాడుకునే పద్ధతులు, భౌతిక దూరం మనందరి జీవితంలో భాగస్వామ్యం కావాలని కేంద్ర ఆరోగ్య అధికారులు సూచించారు.