Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, June 14: భారతదేశంలో ఒకరోజును మించి ఒకరోజు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 11,929 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో ఇంత పెద్దమొత్తంలో కేసులు రావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 3,20,922 కు చేరింది. నిన్న ఒక్కరోజే 311  కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9,195 కు పెరిగింది.

నిన్న దేశవ్యాప్తంగా అత్యధికంగా 8,049 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,62,379 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 1,49,348 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్రాల వారీగా ప్రస్తుతం ఉన్న ఆక్టివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి

S. No. Name of State / UT Active Cases* Cured/Discharged/Migrated* Deaths** Total Confirmed cases*
1 Andaman and Nicobar Islands 5 33 0 38
2 Andhra Pradesh 2688 3195 82 5965
3 Arunachal Pradesh 83 4 0 87
4 Assam 2126 1584 8 3718
5 Bihar 2295 3956 39 6290
6 Chandigarh 54 286 5 345
7 Chhattisgarh 875 631 6 1512
8 Dadra and Nagar Haveli and Daman and Diu 33 2 0 35
9 Delhi 22742 14945 1271 38958
10 Goa 453 70 0 523
11 Gujarat 5707 15883 1448 23038
12 Haryana 3868 2803 78 6749
13 Himachal Pradesh 183 313 6 502
14 Jammu and Kashmir 2554 2269 55 4878
15 Jharkhand 887 816 8 1711
16 Karnataka 3095 3648 81 6824
17 Kerala 1342 1046 19 2407
18 Ladakh 368 68 1 437
19 Madhya Pradesh 2817 7377 447 10641
20 Maharashtra 51392 49346 3830 104568
21 Manipur 358 91 0 449
22 Meghalaya 21 22 1 44
23 Mizoram 106 1 0 107
24 Nagaland 87 76 0 163
25 Odisha 1119 2594 10 3723
26 Puducherry 92 82 2 176
27 Punjab 671 2327 65 3063
28 Rajasthan 2782 9337 282 12401
29 Sikkim 59 4 0 63
30 Tamil Nadu 18881 23409 397 42687
31 Telangana 2203 2352 182 4737
32 Tripura 730 315 1 1046
33 Uttarakhand 685 1077 23 1785
34 Uttar Pradesh 4858 7875 385 13118
35 West Bengal 5693 4542 463 10698
Cases being reassigned to states 7436 7436
Total# 149348 162379 9195 320922

 

ఇక దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో మూడింట ఒకవంతు ఒక్క మహారాష్ట్ర నుంచే ఉన్నాయి. అది కూడా ఎక్కువగా ముంబై దాని చుట్టుపక్కల నగరాల నుంచి భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.

మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,04,568  మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 3,830  కు చేరుకుంది. ఒక్క ముంబై నగరంలోనే 56 వేలకు పైగా కోవిడ్ బాధితులున్నారు. కరోనావైరస్ కారణంగా ముంబైలో ఇప్పటివరకు 2100 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు.