Cows in Ayodhya to get special winter coats this year (Photo-PTI)

Ayodhya, November 25: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య మున్సిపల్ కార్పోరేషన్ (Ayodhya Municipal Corporation) ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. అయోధ్య మునిసిపల్ అధికారులు పట్టణంలోని ఆవులను చలి నుంచి కాపాడేందుకు వాటికి చలికోట్లు కుట్టిస్తున్నారు. జనపనారతో వీటిని తయారు చేస్తున్నారు. అయోధ్య నగరంలో ఉన్న ఆవులన్నింటికి చలికోట్లు చేయించాలని నిర్ణయించింది. మున్సిపల్ కమిషనర్ నీరజ్ శుక్లా (Niraj Shukla, Nagar Nigam Commissioner of Ayodhya) ఈ విషయాన్ని వెల్లడించారు.

మొత్తం మూడు,నాలుగు దశల్లో ఈ పథకాన్ని అమలుచేస్తామని చెప్పారు. మొదట బైషింగ్‌పూర్‌ గోశాల(Baishingpur cow shelter)లో దీన్ని అమలుచేస్తామన్నారు. ఇక్కడి గోశాలలో 700 ఎద్దులతో (700 bulls) సహా మొత్తం 1200 పశువులు ఉన్నాయి. వీటిలో మొదట 100 ఆవులు,దూడలకు చలికోట్లు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చామన్నారు.

రూ.250నుంచి 300విలువ చేసే కోట్‌ మూడు లేయర్ గా కుట్టిస్తున్నారు. ఆవులకు, ఎద్దులకు వేర్వేరు డిజైన్ల కోట్లు ఇవ్వనున్నారు. చలికి తట్టుకునే విధంగా కోట్లు ఇవ్వడంతో పాటు షెడ్ లను కూడా పునర్మించనున్నట్లు వెల్లడించారు. నగర మేయర్(Mayor Rishikesh Upadhyay), కమిషనర్ లు మాట్లాడుతూ.. చలికి తట్టుకోవాలని కోట్లతో పాటు, షెడ్ లను కూడా బాగుచేస్తామని తెలిపారు.

మా దృష్టి ఆవులను పరిరక్షించడమే. ఆవుల షెడ్‌లు బాగు చేసి రాష్ట్రంలోనే ఉత్తమ నగరంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే గోశాలల్లో చలిమంటలు కూడా వేయిస్తామని, ఆవులు కూర్చోడానికి వెచ్చగా ఉండేందుకు గడ్డిని పరిపిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అత్యుత్తమంగా వాటిని తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు.