Naya Raipur, OCT 12: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు (Chhattisgarh Elections) షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తులో తలమునకలైంది. దీనికి సంబంధించి రాయపూర్‌లో అతి ముఖ్యమైన సమావేశంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ (Chhattisgarh Chief Minister Bhupesh Baghel) క్యాండీక్రష్ (Candy Crush) ఆడడం రాజకీయంగా మాటల యుద్ధానికి దారి తీసింది. రాయపూర్‌లో మంగళవారం రాత్రి అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. అత్యంత కీలకమైన ఈ సమావేశంలో సీఎం బఘేల్ తన ఫోన్‌లో క్యాండీక్రష్ ఆడుతూ కనిపించారు. ఈ ఫొటోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेश बघेल भी निश्चिंत हैं, उन्हें पता है कि कितनी भी माथा-पच्ची कर लें सरकार तो आनी नहीं है।
शायद इसीलिए कांग्रेस के प्रत्याशी चयन से संबंधित बैठक में ध्यान देने के बजाय उन्होंने CANDY CRUSH खेलना उचित समझा। 😂 pic.twitter.com/bcer39zx4o
— Amit Malviya (@amitmalviya) October 10, 2023
‘అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు జరుగుతూ ఉంటే సీఎం హాయిగా క్యాండీక్రష్ ఆడుతూ రిలాక్సవుతున్నారు. బహుశా కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవదని ఆయనకూ తెలిసి ఉంటుంది’’ అని మాలవీయ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వీటిని బఘేల్ తిప్పికొడుతూ గతంలో తాను ఛత్తీస్‌గఢ్ సంప్రదాయ క్రీడలు గిల్లీ దందా, భవురా ఆడినప్పుడు కూడా బీజేపీ విమర్శలు చేసిందని గుర్తు చేశారు.
पहले भाजपा को ऐतराज़ था कि मैं गेड़ी क्यों चढ़ता हूं, भौंरा क्यों चलाता हूं, गिल्ली डंडा क्यों खेलता हूं, प्रदेश में छत्तीसगढ़िया ओलंपिक क्यों हो रहे हैं?
कल एक बैठक से पहले फ़ोटो मिल गई जिसमें मैं कैंडी क्रश खेल रहा हूं। अब भाजपा को उस पर ऐतराज़ है।
दरअसल उनको मेरे होने पर ही… pic.twitter.com/PtEfmrSrps
— Bhupesh Baghel (@bhupeshbaghel) October 11, 2023
‘‘ఛత్తీస్‌గఢ్ సంప్రదాయ క్రీడలు ఎంత ఇష్టంగా ఆడతానో క్యాండీక్రష్ అంతే ఇష్టంగా ఆడతాను. క్యాండీక్రష్‌లో చాలా లెవల్స్ పూర్తయ్యాయి. ఇంకా ఆటని కొనసాగిస్తూ లెవల్స్ అన్నీ దాటతాను. ఎవరు అధికారంలోకి వస్తారో రారో ప్రజలే నిర్ణయిస్తారు. ఎవరు గెలుస్తారో అందరికీ తెలుసు’’ అని ఎదురుదాడి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.