Cyclone BulBul brews in Bay of Bengal. (Photo Credits: PTI)

New Delhi, November 6: బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారింది. ఇది అండమాన్ సమీపంలో కేంద్రీకృతమై ఉంది. మరికొన్ని గంటల్లో ఇది తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (The India Meteorological Department ) అంచనా వేస్తుంది. ఆ తర్వాత 24 గంటల్లో పెను తుఫానుగా మారి, ఉత్తర వాయువ్య దిశగా పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

ఈ బుల్ బుల్ తుఫాన్ (BulBul Cyclone) ప్రభావంతో తూర్పు తీరంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మరియు ఒడిశా (Odisha) రాష్ట్రాలలో నవంబర్ 9 నుంచి 12 తేదీల మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర, ఒడిషా మరియు పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లోని 30 జిల్లాలకు ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందని అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు చేసింది.

నవంబర్ 8 మరియు 10 తేదీలలో ఒడిశా తీరంలో భారీవర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ఐఎండి డైరెక్టర్ హెచ్ ఆర్ బిస్వాస్ హెచ్చరించారు.

SkymetWeather Update:

 

ఈ ఏడాది భారతదేశాన్ని తాకిన ఏడవ తుఫాను ఇది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు సముద్ర తీరాన్ని సందర్శించవద్దని, అలాగే మత్స్యకారులను సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే తీరప్రాంతం పొడవునా 600 తుఫాన్ విపత్తు శిబిరాలను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు.