Lucknow, Sep 19: ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఒక దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం (Dalit girl gang-raped) చేసి నిప్పంటించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి విదితమే. ఈ ఘటనలో బాధితురాలు చికిత్స పొందుతూ మరణించింది. దాదాపు 12 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మహిళ చివరకు ఓడిపోయింది.ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పంజాగుట్టలో దారుణం, యువతి గొంతు కోసి పరారయిన యువకుడు, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
లక్నోలో పోస్టుమార్టం అనంతరం మృతుడి మృతదేహాన్ని పిలిభిత్‌లోని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. యూపీలోని ఫిలిబిత్ జిల్లాలో కున్వర్‌పూర్ గ్రామంలో ఈనెల ఆరంభంలో టీనేజర్‌పై సామూహిక లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. లైంగిక దాడికి పాల్పడిన అనంతరం బాలికపై నిందితులు డీజిల్ పోసి నిప్పంటించారు.