Biryani Seller: బిర్యాని అమ్మాడని చావబాదారు, కుల జాడ్యంలో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ నోయిడా, కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు వేగవంతం
Dalit youth assaulted in Noida | (Photo Credits: Screengrab/Twitter/@wajihulla)

New Delhi, December 15: ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా కుల జాడ్యం(Casteism) మాత్రం వీడటం లేదు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో మళ్లీ ఈ కుల జాడ్యం పడగవిప్పింది. అక్కడ ఓ దారుణం చోటు చేసుకుంది.దళిత వ్యక్తి బిర్యానీ అమ్ముతున్నాడనే ఆగ్రహంతో కొందరు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. గ్రేటర్‌ నోయిడా(Greater Noida)లోని రబుపురాలో ఈ దాడి జరిగింది.

ఘటన సంబంధించి వీడియో దృశ్యాలు (video Visuals) ఎవరో రికార్డు చెయ్యడంతో అవి ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారాయి. 43 ఏళ్ల దళిత వ్యక్తి లోకేశ్‌ను కులం పేరుతో కొందరు తిడుతున్నట్లు, కొడుతున్నట్లుగా ఉన్న దృశ్యాలు వీడియోలో క్లియర్‌గా కనిపిస్తున్నాయి.

చాలాసార్లు వద్దని హెచ్చరించినా కూడా బిర్యానీ అమ్ముతున్నాడనే కారణంతోనే వారు దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. పలుసార్లు తాము హెచ్చరించినా అతను బిర్యానీ విక్రయిస్తున్నాడనే ఆగ్రహంతో వారు దళితుడిపై దాడికి తెగబడినట్టు స్ధానికులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సెన్సిటీవ్ ఇష్యూ కావడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Watch Video of Dalit Man Being Thrashed For Selling Biryani:

కాగా ఘటనపై ప్రముఖ నటి ఊర్మిళా మటోండ్కర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటరానితనం పాటించడం మన సంస్కృతి కాదని.. ‘సబ్‌ కా సాథ్‌..సబ్‌ కా వికాస్‌ ‘ ‘సిద్దాంతానికి పూర్తి విరుద్దమని ట్వీట్ చేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలులోకి వచ్చింది.