Representational Purpose Only (File Image)

Mumbai, March 19:  దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ శ్రద్ధా వాకర్ తరహా ఘటన ముంబైలో చోటు చేసుకుంది. శ్రద్ధాను అతడి బాయ్ ఫ్రెండ్ చంపి, మృతదేహాన్ని ముక్కలు చేయగా.. ఇక్కడ కన్నకూతురే తల్లిని చంపి డెడ్ బాడీని (Dead body) ముక్కలు చేసింది. అంతేకాదు మృతదేహాన్ని రెండు నెలల పాటు ఇంట్లోనే ఉంచుకుంది. ఆపై.. దుర్వాసన రాకుండా 200 రకాల పర్ ఫ్యూమ్స్ వాడటం మరింత షాక్ కి గురి చేస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ముంబైలో (Mumbai Shocker) వెలుగుచూసింది. ముంబైలోని లాల్ బాగ్ ప్రాంతంలో తల్లికూతురు నివాసం ఉండేవారు. ఏం జరిగిందో కానీ, 21 ఏళ్ల కూతురు రింపుల్ జైన్ (Rimpule jain).. కన్నతల్లిని చంపేసింది. ఆ తర్వాత ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు.. మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో కుక్కింది.తల, మొండెం బీరువాలో.. కాళ్లు, చేతులు స్టీల్ వాటర్ క్యాన్ లో దాచింది. అలా రెండున్నర నెలలపాటు శవాన్ని ఇంట్లోనే ఉంచింది. దుర్వాసన రాకుండా ఉండేందుకు ఆమె అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంది. ఇందుకోసం 200 రకాల పర్ ఫ్యూమ్స్ వాడింది.

 US Horror: యుఎస్‌లో దారుణం, మహిళను చంపి గుండెను కోసి అత్తమామలకు కూరను వండి పెట్టిన అల్లుడు, తినకపోవడంతో వారిని కత్తితో పొడిచి దారుణంగా హత్య 

చివరికి.. మార్చి 14న తన సోదరి కనిపించడం లేదని మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు జైన్ ను అరెస్ట్ చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు తల్లీకూతురు నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి వెతికారు. అక్కడ వారికి ఓ బ్యాగ్ కనిపించగా.. దాన్ని ఓపెన్ చేసి చూసి నిర్ఘాంతపోయారు. కుళ్లిపోయి, భరించలేని వాసనతో మృతదేహం భాగాలు కనిపించాయి. పోలీసులు వెంటనే కూతురిని అరెస్ట్ చేశారు.

Uttarapradesh Shocker: భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లి దారుణానికి పాల్పడ్డ జవాన్, మర్యాదగా నీ భర్త ఫోన్‌లో నా భార్య ఫోటోలు తీసేయ్‌ అంటూ ఆగ్రహంతో ఊగిపోయి అఘాయిత్యం 

మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. అసలు తల్లిని ఎందుకు చంపింది? మృతదేహాన్ని నెలల తరబడి ఇంట్లోనే ఎందుకు దాచింది? ఈ ప్రశ్నలకు క్లారిటీ రావాల్సి ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధవాకర్ హత్యోదంతం తీవ్ర సంచలనం రేపింది. ఆ తర్వాత అలాంటి హత్యల ఘటనలు దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో వరుసగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. హత్య చేయడమే కాకుండా మృతదేహాన్ని ముక్కలుగా చేయడం.. మనుషుల్లో ఈ విపరీత ప్రవర్తన.. ఆందోళనకు గురి చేసే అంశం.