New Delhi, SEP 17: ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి (Delhi CM) ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంతో కలిపి ఐదుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం ( Athishi Swearing In Ceremony) చేయనున్నారు. ఇందులో గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ సారి కొత్తగా ముఖేష్ అహ్లావత్ సైతం కేబినెట్‌గా ప్రమాణం సైతం ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఆయన సుల్తాన్‌పురి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగిన అతిషి సీఎంగా నియామకయ్యారు. సీఎంతో పాటు మంత్రులు సైతం ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. ఆ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కేజ్రీవాల్ తన రాజీనామాతో పాటు కొత్త సీఎంగా అతిషి పేరును ప్రతిపాదిస్తూ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎల్‌జీకి ప్రతిపాదనలు అందజేశారు. అలాగే, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సైతం ప్రతిపాదనలు పంపారు. రాష్ట్రపతి ఆమోదం నేపథ్యంలో శనివారం ప్రమాణస్వీకారం తేదీని ఎల్‌జీ స్వచ్ఛంగా నిర్ణయించారు. కేజ్రీవాల్ రాజీనామా నేపథ్యంలో సాంకేతికంగా మంత్రివర్గం మొత్తం రద్దవుతుంది. దాంతో అతిషితో పాటు మంత్రివర్గం సైతం ప్రమాణం చేయనున్నది. గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలకు తొలిసారిగా కేబినెట్ బెర్తులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.