New Delhi, Mar 21: దేశ రాజధాని ఢిల్లీ నుంచి దోహా నగరానికి వెళుతున్న ఖతార్ ఎయిర్‌వేస్ ప్యాసింజర్ విమానంలో (Delhi Doha Flight) సోమవారం పొగ రావడంతో QR579 విమానాన్ని అత్యవసరంగా పాకిస్థాన్ దేశంలోని కరాచీకి మళ్లించారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఖతార్ విమానం కార్గో ప్రాంతంలో నుంచి పొగలు (Due To Smoke Indication in Cargo Hold) వచ్చాయి. దీంతో అత్యవసరంగా ఈ ఖతార్ విమానాన్ని కరాచీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం ప్రయాణికులను అత్యవసరంగా మెట్లను ఉపయోగించి కిందకు దించామని ఖతార్ ఎయిర్ వేస్ తెలిపింది.
కరాచీ నుంచి దోహాకు ప్రయాణికులను తరలించడానికి రిలీఫ్ ఫ్లైట్ ఏర్పాటు చేశామని ఎయిర్ లైన్స్ తెలిపింది. తమ ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు ఖతార్ ఎయిర్ వేస్ క్షమాపణలు చెప్పింది. మార్చి 21వతేదీన ఢిల్లీ నుంచి దోహాకు వెళ్లాల్సిన క్యూఆర్579 విమానం కార్గో హోల్డ్‌లో పొగలు కనిపించడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించి కరాచీకి మళ్లించామని ఖతార్ ఎయిర్‌వేస్ వివరించింది. ఆ విమానంలో సుమారు 100 మందికిపైగా ప్రయాణికులు (100 Passengers Diverted To Karachi) ఉన్నారు. కార్గో ప్రాంతంలో పొగ వచ్చినట్లు గుర్తించారు.
ఢిల్లీ నుంచి తెల్లవారుజామున 3.50 నిమిషాలకు విమానం బయలుదేరింది. ఆ తర్వాత అది కరాచీలో 5.30 నిమిషాలకు ల్యాండ్ అయ్యింది. దోహా నుంచి కనెక్టింగ్ ఫ్లయిట్ ఉన్న ప్రయాణికులు అందులో ఉన్నారు. విమానంలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఆహారం, నీళ్లు ఇవ్వడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.