
New Delhi, June 6: ఢిల్లీలో హర్రర్ చోటు చేసుకుంది. పోలీసులు ఓ బ్యాగ్ తెరిచి చూడగా అందులో తెగిన మానవ శరీర భాగాలు ( Human Body parts recovered) ఉన్నాయి. కళ్యాణ్‌పురి ప్రాంతంలోని రాంలీలా మైదానం వద్ద ఉన్న చెట్ల పొదల్లో ఒక బ్యాగ్ ( mysterious bag near Kalyanpuri) పడి ఉంది. దాని నుంచి దుర్వాసన రావడాన్ని పెట్రోలింగ్ పోలీసులు ఆదివారం గమనించారు. వెంటనే ఆ ప్రాంతం పరిధిలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ పోలీస్ స్టేషన్ అధికారి, సిబ్బంది రాంలీలా గ్రౌండ్ (Ramlila grounds) వద్దకు చేరుకున్నారు. అక్కడి పడేసి ఉన్న బ్యాగ్‌ను తెరిచి చూశారు. అందులో ఒక వ్యక్తి శరీర భాగాలు తెగిపడి ఉండటం చూసి షాకయ్యారు. భర్త కాదు కిరాతకుడు, భార్యను చంపి, శవాన్ని ముక్కలుగా చేసిన డ్రమ్ములో దాచిపెట్టాడు, జూబ్లీహిల్స్ పరిధిలో దారుణ ఘటన
వెంటనే నేర విభాగం పోలీసులతోపాటు ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల (ఎఫ్‌ఎస్‌ఎల్) సిబ్బందిని అక్కడకు రప్పించారు. సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. బ్యాగ్‌లో తెగిపడి ఉన్న వ్యక్తి శరీర భాగాలను ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. పండవ్ నగర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. శరీర భాగాలన్నింటినీ ఎల్‌బిఎస్ మార్చురీలో భద్రపరిచారు.