
New Delhi, Jan 30: వాయువ్య ఢిల్లీలోని షకూర్ బస్తీలో కత్తితో పొడిచిన మహిళ మృతదేహం లభించిన నాలుగు రోజుల తర్వాత, హత్యకు సంబంధించి (Delhi Woman Murder Case) 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ మహిళతో తాను స్నేహంగా ఉండేవాడినని, అయితే ఆ తర్వాత ఆమె అతడిని తప్పించడం ప్రారంభించిందని ఆ వ్యక్తి చెప్పాడు. కలుద్దామనే సాకుతో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి పిలిచి దాదాపు 50 సార్లు కత్తితో (Man stabs woman 50 times) పొడిచాడు.
జనవరి 25న మధ్యాహ్నం 1.30 గంటలకు షకూర్ బస్తీ వద్ద రైలు పట్టాల దగ్గర మృతదేహం లభ్యమైనట్లు పోలీసు అధికారి తెలిపారు.100 గంటల ఫుటేజీని పరిశీలించి సమగ్ర విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని గుర్తించారు.అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని బుద్ విహార్‌కు చెందిన పాండవ్ కుమార్ (21)గా గుర్తించారు. కూలి పని చేస్తుంటాడని తెలిపారు.
డీసీపీ (ఔటర్) జిమ్మీ చిరామ్ మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంగా ఆ మహిళతో తనకు స్నేహం ఉందని విచారణలో కుమార్ పేర్కొన్నాడు. ఆమె అక్కకు పెళ్లి కావడంతో బీహార్‌లోని తన స్వగ్రామంలో ఆమెను కలిశాడు. "గత కొన్ని నెలలుగా, బాధితురాలికి అనేక సంబంధాలు ఉన్నాయని, తనను విస్మరిస్తుందని అతను అనుమానించాడు. అందుకే, అతను ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు" అని అధికారి తెలిపారు.