Delhi Police Official Inspects Singhu Border (Photo Credits: X/@DelhiPolice)

New Delhi, SEP 08: జీ-20 సమావేశాలకు దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సిద్ధమైంది. జీ-20 సదస్సులో (G 20 Meeting) పాల్గొనేందుకు అగ్ర దేశాధి నేతలు మరి కొన్ని గంటల్లో భారత్ కు చేరుకోనున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఒక్కొక్కరూ భారత గడ్డపై అడుగు పెట్టనున్నారు. ఫస్ట్ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇండియాకు రానున్నారు. సాయంత్రం అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఢిల్లీ చేరుకోనున్నారు. బైడెన్ ఇండియాకు బయలుదేరారు. సాయంత్రం ప్రధాని మోదీతో బైడెన్ భేటీ కానున్నారు. అమెరికా, ప్రాన్స్, బ్రిటన్, కెనడా వంటి అగ్ర దేశాధి నేతలతోపాటు ఇతర దేశాల ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

మొత్తంగా జీ 20 కూటమిలోని 20 సభ్య దేశాలు, 11 ఆహ్వాన దేశాలు, ఐరాస, ఐఎమ్ఎఫ్ (IMF), ప్రపంచ బ్యాంక్ (World Bank) లాంటి అనేక అంతర్జాతీయ సంస్థల అధినేతలు ఈ సదస్సుకు హాజరయ్యేందుకు ఇవాళ భారత్ లో దిగనున్నారు.

 

దీంతో ఢిల్లీలో హైసెక్యూరిటీలోకి (Security) వెళ్లింది. 5 వేల సీసీ కెమెరాలతో ఢిల్లీ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్న పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని భారత్ మహా మండపం కన్వెన్షన్ సెంటర్ లో జరుగనున్న ఈ కార్యక్రమ ఎజెండాలో కీలక విషయాలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలను పెంచడం, అంతర్జాతీయ రుణ నిర్వహణను సరళీకరించడంపై జీ 20 సదస్సులో ప్రపంచ అధినేతలు చర్చించనున్నారు. అంతేకాదు క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ, భౌగోళిక, రాజకీయ అనిశ్చితి ప్రభావం, గ్రీన్ డెవలప్ మెంట్, వాతావరణ మార్పులు వేగవంతమైన సుస్థిర అభివృద్ధి, వ్యవసాయం, ఆహార వ్యవస్థ, సాంకేతిక మార్పులు, 21 శతాబ్ధికి బహు పాక్షిక సంస్థలు, మహిళా సాధికారితతో అభివృద్ధి లాంటి అంశాలే ఎజెండాగా జీ20 సదస్సు సాగనుంది.