Delhi Liquor Scam Supreme Court grants bail to AAP leader Manish Sisodia(X)

Delhi, Aug 9:  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చింది. విచారణ ఆలస్యమవుతున్న నేపథ్యంలో బెయిల్ ఇస్తున్నట్లు ప్రకటించింది న్యాయస్థానం. అయితే పాస్ పోర్టు సరెండర్ చేయాలని సిసోడియాను ఆదేశించింది న్యాయస్థానం.

జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. సిసోడియా బెయిల్ పిటిషన్‌ పై ఆగస్టు5- 6న విచారణ జరిపి సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. సిసోడియా బెయిల్‌ను ఈడీ, సీబీఐ వ్యతిరేకించాయి. సిసోడియా విచారణకు సహకరించడం లేదని, జాప్యం చేస్తున్నారని తెలిపాయి. బెయిల్ ఇస్తే సాక్ష్యాలను, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టును దర్యాప్తు సంస్థలు కోరాయి.

కానీ సిసోడియా తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కస్టడీలో ఉన్నా ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ కొనసాగుతారు, పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు, నేటితో ముగియనున్న కేజ్రీవాల్ ఈడీ కస్టడీ

Here's Tweet:

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గత ఏడాది ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయగా జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే గత ఏడాది మార్చి 9న ఈడీ ఆయనను అదుపులోకి తీసుకుంది. అప్పటి నుండి 17 నెలలుగా జైలులోనే ఉన్నారు సిసోడియా. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో తీహార్ జైలు నుండి బయటకు రానున్నారు.