New Delhi, April 6: ఢిల్లీలోని పార్లమెంట్ భవనం సమీపంలో గురువారం ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.రోహిణి నివాసి అయిన రాజ్ కుమార్ శర్మ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి మద్దతుగా నినాదాలు చేస్తున్నాడని వర్గాలు తెలిపాయి.
అతన్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు, అతను "దేశ్ కో బచా లో (దేశాన్ని రక్షించండి)" అని అరవడం వినిపించింది. అతను తన జీవితాన్ని ముగించడానికి ప్రయత్నించడం వెనుక కారణం ఇంకా నిర్ధారించబడలేదు. పార్లమెంట్ సమీపంలో రాజ్ కుమార్ శర్మ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న కోణంలో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi )కి మద్దతుగా ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.