New Delhi, February 7: నిర్భయ దోషులకు (Nirbhaya Case Convicts) ఉరిశిక్ష అమలు చేసేందుకు మరోసారి కొత్తగా డెత్ వారెంట్ (Death Warrant) జారీచేయాలని తీహార్ జైలు అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ను దిల్లీ హైకోర్ట్ (Delhi High Court) శుక్రవారం కొట్టివేసింది. దోషులకు ఇంకా చట్టపరమైన అవకాశాలు మిగిలి ఉన్నందున ఇప్పుడే వారికి డెత్ వారెంట్ జారీ చేయలేమని కోర్ట్ స్పష్టం చేసింది. "దోషులు జీవించేందుకు చట్టపూరితమైన అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నప్పుడు వారిని ఉరితీయడం నేరపూరితమైన పాపం" అని కోర్ట్ వ్యాఖ్యానించింది.
నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషుల్లో పవన్ గుప్తా మినహా మిగతా ముగ్గురి క్షమాభిక్ష పిటిషన్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇప్పటికే తిరస్కరించారు. ఈ నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు ఆ నలుగురిని ఉరితీసేందుకు అనుమతివ్వాలని కోర్టును ఆశ్రయించారు.
అయితే అంతకుముందే ఆ నలుగురు దోషులు తమ చివరి చట్టపరమైన అవకాశాలన్నీ ఉపయోగించుకునేందుకు దిల్లీ హైకోర్ట్ ఫిబ్రవరి 05 నుంచి వారం రోజుల గడువు విధించిన విషయం తెలిసింది. ఈ క్రమంలోనే తీహార్ జైలు అధికారులు సరైన సమాచారం లేకుండా, ఊహాజనిత ఆలోచనలతో పిటిషన్లు వేయడం సబబు కాదు. ఈ దరఖాస్తుకు ఎలాంటి మెరిట్ లేనందున్న పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
Check ANI tweet:
2012 Delhi gang-rape case: Court while dismissing the plea of prosecution stated that death warrants cannot be issued on the basis of conjecture alone. https://t.co/HQwcjxqCsr
— ANI (@ANI) February 7, 2020
మరోవైపు దోషులను వేర్వేరుగా ఉరితీసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతకుముందే దిల్లీ హైకోర్టులో దాఖలు చేసినప్పటికీ, దిల్లీ కోర్ట్ అనుమతి నిరాకరించడంతో ఈ తీర్పును కేంద్రం సుప్రీంలో సవాలు చేస్తుంది. దోషులు దేశం యొక్క సహనాన్ని పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నారని మరియు ఉరిశిక్ష అమలును ఆలస్యం చేయడానికి వ్యవస్థలో సాధ్యమయ్యే అన్ని లొసుగులను ఉపయోగిస్తున్నారని కేంద్రం తమ పిటిషన్ లో పేర్కొంది. కాగా, ఈ పిటిషన్ పై ఫిబ్రవరి 11న విచారణ చేపడతామని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది.