Newdelhi, Aug 2: ఢిల్లీలో (Delhi) మరోసారి బాంబు బెదిరింపుల (Bomb Threat) మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. నగరంలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాలను బాంబుతో పేల్చేస్తామని దుండగులు ఓ మెయిల్ పంపించారు. సమాచారం అందిన వెంటనే సదరు పాఠశాల వద్దకు వెళ్లిన పోలీసులు విద్యార్థులను బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. అయితే ఆ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువుగానీ, మరే పేలుడు పదార్థాలూ లభించలేదని అధికారి ఒకరు పేర్కొన్నారు.
భార్య వైఎస్ భారతితో కలిసి పాస్ పోర్ట్ రెన్యువల్ చేయించుకున్న మాజీ సీఎం జగన్
According to the police, the email claimed that a bomb was planted in the school. Upon investigation, the police said they suspect it was a hoax call as nothing suspicious was found#Delhi #GreaterKailash #bombthreats #Schoolhttps://t.co/qJVVPmr09b pic.twitter.com/OcIxlSrAIf
— News18 (@CNNnews18) August 2, 2024
ఆగంతకుల కోసం వేట
ఈ మెయిల్ వచ్చిన సోర్స్ కోడ్, అడ్రస్ ఆధారంగా ఆగంతకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వారిని త్వరలో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.