stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

New Delhi, Jan 27: దేశ రాజధాని ఢిల్లీలో అమానుష ఘటన (Delhi Shocker) చోటు చేసుకుంది. ఒక యువతిపై మద్యం, డ్రగ్స్​ కుటుంబానికి చెందిన వారు సాముహికంగా అత్యాచారం (Alleged Rape Survivor Paraded) చేసి, ఆపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ సంఘటన తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. అత్యాచార బాధితురాలిని ఢిల్లీలో ఆమె పొరుగువారు ఊరేగించి, హర్షధ్వానాల మధ్య కొట్టి, జుట్టు షేవ్ చేసి, ముఖం నల్లగా (Hit By Women In Delhi Amid Cheers) చేశారని ఢిల్లీ మహిళా కమిషన్ ఈరోజు తెలిపింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడంతో నలుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉన్న కస్తూర్బా నగర్​కు చెందిన 20 ఏళ్ల యువతిని అదే ప్రాంతానికి ఉన్న ఒక యువకుడు ప్రేమించాడు. చాలా రోజులు ఆమె వెంటపడ్డాడు. యువతి అతని ప్రేమను నిరాకరించడంతో విచారంతో ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గతేడాది నవంబరులో జరిగింది. అయితే, తమ కుమారుడి మృతికి ఆ యువతి కారణమని యువకుడి కుటుంబ సభ్యులు ఆమెపై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆయువతిని నిన్న ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చారు. ఆమెను జుట్టుపట్టుకొని కొడుతూ.. నీచంగా ప్రవర్తించారు.

కామంతో రగిలిన యువకుడు, అసహజ సెక్స్ చేయాలంటూ బాలుడిపై ఒత్తిడి, నో చెప్పడంతో దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఈ క్రమంలో కొంత మంది పురుషులు.. ఆ యువతిపై బహిరంగంగానే సాముహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అక్కడ ఉన్న మహిళలు కూడా.. యువతిపై పురుషులు అత్యాచారం చేసేలా ప్రేరేపించారు. ఆమెను నానా దుర్భాషలాడుతూ.... ఆమె జుట్టును కత్తిరించారు. ఆమె ముఖానికి నలుపు రంగు పూశారు. ఆమెను ఇష్టం వచ్చినట్లు కొడుతూ.. అవమానపర్చారు. చెప్పులు, బూట్లతో కొడుతూ.. దండలు చేసి యువతి మెడలో వేసి.. ఊరేగించారు.

తగ్గేదేలే అంటూ అమాయకుడిని చంపేశారు, ఆ రెండు సినిమాలు చూసి గ్యాంగ్‌స్టర్‌లుగా ఎదగాలనుకున్న ముగ్గురు టీనేజర్లు, వారి చెప్పిన విషయాలను విని షాక్ తిన్న ఢిల్లీ పోలీసులు

కాగా చనిపోయిన బాలుడు కుటుంబానికి చెందిన వారంతా మద్యం, డ్రగ్స్​ వ్యాపారస్తులని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దీనిపై ఢిల్లీ మహిళ కమిషన్​ చైర్​పర్సన్​ స్వాతి మలివాల్ (Delhi Commission for Women chief Swati Maliwal)​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళను పరామర్శించారు. వెంటనే బాధిత యువతిపై దాడిచేసిన వారందరిని అరెస్టు చేయాలని ట్విటర్​ వేదికగా ఢిల్లీ పోలీసు అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, బాలికకు భద్రత కల్పించడానికి వారు తీసుకున్న చర్యలను అందించాలని ఢిల్లీ పోలీసులను కోరారు.

అదే విధంగా ఘటనపై 72 గంటలలో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు నోటిసులు జారీచేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని పోలీసువారిని ఆదేశించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.