![](https://test1.latestly.com/wp-content/uploads/2020/09/gangrape.jpg)
Jaipur, Feb 14: రాజస్థాన్ రాష్ట్రంలో చురు రైల్వే స్టేషన్ సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం పేరుతో మహిళను ఢిల్లీ నుంచి రప్పించిన (Delhi woman visiting Rajasthan for job) నలుగురు యువకులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి (gang-raped by 4 men) పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళ చేతులు, కాళ్లు కట్టేసి హోటల్ మిద్దె నుంచి (thrown off building's 1st floor) తోసేశారు. ఈ దారుణ ఘటనలో అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చురూ నగరానికి చెందిన నలుగురు వ్యక్తులు, ఢిల్లీకి చెందిన 25 ఏండ్ల మహిళకు ఫోన్ చేశారు. ఉద్యోగానికి ఎంపిక అయినట్లు నమ్మించి చురూ నగరానికి ఆమెను రప్పించారు. ఆమె చురుకు వచ్చిన తర్వాత, నలుగురు నిందితులు ఆమెను ఒక హోటల్‌కు తీసుకువచ్చారు,
అనంతరం హోటల్‌లో ఆ మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కాగా, మద్యం సేవించిన నలుగురు యువకులు అనంతరం ఆ మహిళ చేతులు, కాళ్లను తాడుతో కట్టేశారు. ఆమెను హోటల్ పైనుంచి తోసేశారు. అయితే ఒక పోల్‌కు తాడు చిక్కుకోవడంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మమతా సరస్వత్ తెలిపారు. మద్యం మత్తులో ఉన్న నిందితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను భవానీ సింగ్, సునీల్ రాజ్‌పుత్, దేవేంద్ర సింగ్, విక్రమ్ సింగ్‌లుగా పోలీసులు గుర్తించారు.