Representational Image (Photo Credits: ANI)

Hyd, Feb 14: భాగ్యనగరంలోని బంజారాహిల్స్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. మరదలితో కలిసి భార్య చిన్నచూపు చూసిందని (Family Issues ) ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 2లోని సయ్యద్‌నగర్‌ ఫస్ట్‌ లాన్సర్‌లో నివసించే సయీద్‌బిన్‌ మాబ్రుక్‌(40) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. ఈ నెల 9న భార్య షాహిన్‌ బేగం గొడవ పడి తన చెల్లెలు ఇంటికి వెళ్లింది.

దీంతో ఈ నెల 12వ తేదీన రాత్రి తన భార్యను తీసుకురావడానికి సయీద్‌ అక్కడికి వెళ్లిగా భార్యతో పాటు ఆమె చెల్లెలు కించపరిచారు.అదే రోజు రాత్రి ఇంటికి వచ్చిన సయీద్‌ తెల్లవారుజామున తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య (Man ends life at Banjara Hills) చేసుకున్నాడు. తన సోదరుడి ఆత్మహత్యకు భార్య, తోడల్లుడు, ఆయన మరదలు కారణమని వారిపై చర్యలు తీసుకోవాలంటూ మహ్మద్‌ బిన్‌ హమీద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య (Murder) చేయించిన ఘటన మండలంలోని పెద్ద ఎక్లారలో చోటు చేసుకుంది. ఎస్సై శివకుమార్, గ్రామస్తులు శనివారం తెలిపిన వివరాలు.. బిచ్కుంద మండలం కందర్‌పల్లికి చెందిన ఫిరంగి సాయిలు(35)కు 16 ఏళ్ల క్రితం మండలంలోని పెద్ద ఎక్లారకు చెందిన రుక్మిణితో వివాహం జరిగింది. డిసెంబర్‌లో రుక్మిణి తల్లి మరణించింది. అప్పటి నుంచి సాయిలు తన భార్యతో కలిసి అత్తగారింటి వద్దే ఉంటున్నాడు. అయితే రుక్మిణి గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన బంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను చంపించింది.

భర్త తన దగ్గరకు ఎందుకు రావడం లేదని భార్య నిఘా, కట్ చేస్తే ఇంకో ఆవిడతో...న్యాయం చేయాలంటూ వీధుల్లో నిరసనకు దిగిన మహిళా డాక్టర్

ఈ ఘటన డిసెంబర్‌లో చోటు చేసుకుంది. సాయిలు మృతదేహాన్ని వ్యవసాయ భూమిలో పాతిపెట్టారు. తన కొడుకు కనబడకపోవడంతో సాయిలు తల్లి బషవ్వ తెలిసిన వారి వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. అయితే సాయిలును హత్య చేసిన వారిలో ఓ నిందితుడు మద్యం తాగి శనివారం హత్య గురించి చెప్పినట్లు తెలిసింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి, ఇన్‌చార్జీ సీఐ మురళీ పెద్ద ఎక్లారలో విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలాన్ని గుర్తించారు. ఆదివారం మృతదేహాన్ని వెలికి తీయనున్నట్లు తెలిసింది.