Citigroup (Representational Image; Photo Credit: Twitter/ @KumarKailash16)

ఫైనాన్షియల్ టైమ్స్ (FT) ప్రకారం, సిటీ గ్రూప్ CEO జేన్ ఫ్రేజర్ సంస్థ యొక్క 240,000 మంది ఉద్యోగులకు బలమైన వార్నింగ్ ఇచినట్లు తెలుస్తోంది. కంపెనీని ముందుకు తీసుకెళ్లేందుకు మార్పులకు రెడీగా ఉండాలని లేదంటే కంపెనీ నుంచి వైదొలగాలని ఆదేశాలు జారీ చేసింది. గత 15 సంవత్సరాలలో బ్యాంక్ చరిత్రలో అత్యంత విస్తృతమైన పునర్నిర్మాణం గురించి ఆమె ఇటీవల ప్రకటించిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

2021లో యునైటెడ్ స్టేట్స్‌లో మూడవ-అతిపెద్ద బ్యాంక్‌కి నాయకత్వం వహిస్తున్నందున, రిస్క్‌ని తగ్గించడం, లాభదాయకతను పెంచడం అనే సవాలును సిటీ గ్రూపు ఎదుర్కొంటుంది.ఈ బ్యాంక్ పురోగతి కోసం చాలా ఆశయాలు ఉన్నాయి. ఇది చాలా వేగంగా కదులుతుంది. మీరు దాన్ని అందుకోవాల్సి ఉంటుందని ఉద్యోగులకు వార్నింగ్ బెల్స్ పంపించింది.

వందలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సిటీ గ్రూప్, వీలీనం అయిన రెండు రోజులకే బ్యాంక్ కీలక నిర్ణయం

కాబట్టి మీరు వెంటనే లీన్ అవ్వండి, క్లయింట్‌లతో గెలవడానికి మాకు సహాయపడండి, మార్పులను అందించడంలో మాకు సహాయపడండి లేదా రైలు (కంపెనీ) నుండి దిగండని తెలిపింది.ఇదిలా ఉంటే ఇటీవలి రౌండ్‌లో జరిగిన ఉద్యోగాల కోతలో ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్య ఇంకా తెలియలేదు.