Fadnavis Takes Over As CM: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఫడ్నవిస్, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్‌పై తొలి సంతకం,24 గంటల్లో బలాన్ని నిరూపించుకోవాలన్న సుప్రీంకోర్టు
Devendra Fadnavis takes charge as Maharashtra Chief Minister (Photo-ANI)

Mumbai, November 25: మహారాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతుంటే బీజేపీ మాత్రం కూల్ గా తన పని తాను చేసుకోపోతోంది. అనూహ్య ట్విస్టుల మధ్య మహారాష్ట్ర ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌ (Devendra Fadnavis) ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఫడ్నవీస్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్‌(CM relief fund cheque)పై తన తొలి సంతకాన్ని చేశారు. అనంతరం ఆ చెక్‌ను కుసుం వెంగుర్‌లేకర్‌(Kusum Vengurlekar)కు అందజేశారు.

కాగా మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌((Maharashtra Chief Minister) ఈ నెల 23న ప్రమాణస్వీకారం చేసిన విషయం విదితమే. ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎం(Deputy Chief Minister Ajit Pawar)గా ప్రమాణం చేశారు.

ANI Tweet

దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఫడ్నవీస్‌ ప్రభుత్వం బలనిరూపణ చేసుకునేందుకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఈ నెల 30 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ 24 గంటల్లో బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలపై మంగళవారం ఉదయం 10:30 గంటలకు సుప్రీంకోర్టు తరువాతి తీర్పు ఇవ్వనుంది.

మరో వైపు ఇవాళ మధ్యాహ్నం ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ నాయకులు గవర్నర్‌ కోశ్యారీని రాజ్‌భవన్‌లో కలిశారు. తమకు 162 ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు లేఖ అందజేశారు. తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. ఎప్పుడుంటే ఎప్పుడు 162 ఎమ్మెల్యేల మద్దతు చూపిస్తామని ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ నాయకులు స్పష్టం చేశారు. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 145. ఈ ఫిగర్ ను ఏ ప్రభుత్వం అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.