New Delhi, July 27: స్పైస్‌జెట్ (SpiceJet)కు డెరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) భారీ షాక్ ఇచ్చింది. అనుమతి పొందిన విమానాల్లో 50శాతమే నడపాలని స్పైస్‌జెట్ విమానాలపై డీజీసీఏ ఆంక్షలు (DGCA Orders SpiceJet) విధించింది. 8 వారాల పాటు ఈ ఆదేశాలను పాటించాలని పేర్కొంది. స్పైస్‌జెట్ విమానాల్లో ఇటీవల తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు జులై 9 నుంచి 13 మధ్య స్పైస్‌జెట్‌కు చెందిన 48 విమానాల్లో 53 స్పాట్ చెక్‌లు నిర్వహించింది. భద్రత ప్రమాణాలకు సంబంధించి ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని తెలిపింది. నోటీసులు పంపిన మూడు రోజుల్లోనే స్పాట్ చెక్‌లు చేసింది.
అయితే ఇటీవలి కాలంలో స్పైస్‌జెట్ విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. 18 రోజుల్లోనే 8 సార్లు ఈ సంస్థకు చెందిన విమానాల్లో టెక్నికల్ సమస్యలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ స్పైస్‌జెట్‌కు జులై 6న నోటీసులు పంపింది. అంతర్గత భద్రతా పర్యవేక్షణ తక్కువగా ఉండటం, నిర్వహణ చర్యలు లేకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది.
సురక్షితమైన, సమర్ధవంతమైన, విశ్వసనీయమైన ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌గా నిరూపించుకోవడంలో స్పైస్‌జెట్ విఫలమైందని పేర్కొంది. గత 18 రోజుల్లో కనీసం 8 సార్లు స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. కాగా, ఈ ఎనిమిది వారాల సమయంలో స్పైస్‌జైట్ ఎయిర్‌లైన్స్ సాంకేతకంగా, ఇతర అంశాల పరంగా తమ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. డీసీజీఏ నిర్ణయం స్పైస్‌జెట్ కార్యకలాపాలను ప్రభావితం చేయనున్నది