Dibrugarh Express Derailment Update (Photo-ANI)

Dibrugarh Express Derailment: ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. చండీగఢ్‌-డిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (Chandigarh-Dibrugarh express Train) పట్టాలు తప్పింది. గురువారం మధ్యాహ్నం 2.35 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో (Dibrugarh Express Derailment:) ఓ ప్రయాణికుడు మృతిచెందగా.. పలువురు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. గోండా జిల్లాలో గోండా-మాంకాపూర్ రైల్వే సెక్షన్ మధ్య చండీగఢ్‌-డిబ్రూగఢ్‌ (15904) ఎక్స్‌ప్రెస్‌ రైలు 14 కోచ్‌లు పట్టాలు తప్పాయి.  యూపీలో రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్, కేకలు వేస్తూ బయటకు పరుగులు పెట్టిన ప్రయాణికులు, వీడియో ఇదిగో..

రైలు ఛండీగఢ్‌ నుంచి గోరఖ్‌పూర్‌ వెళ్తున్న సమయంలో మోతిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పికౌరా గ్రామ సమీపంలో ఘటన చోటు చేసుకున్నది. మొదట రెండుకోచ్‌లు పట్టాలు తప్పాయి.నాలుగు ఏసీ బోగీలు సహా 12 బోగీలు బోల్తాపడ్డాయి. ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది వరకు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు.

Here's Videos

ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. క్షతగాత్రులకు తగు చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు చుట్టు పక్కల జిల్లాల్లో ఉన్న ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలను అలెర్ట్‌ చేశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం యోగి ఆదేశించారు. ప్రమాదం నేపథ్యంలో రైల్వే అధికారులు కంట్రోల్‌ రూమ్‌ని ఏర్పాటు చేశారు.అటు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా దీనిపై స్పందించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు.