Chennai, July 7: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని తమిళనాడు(Tamil Nadu)కు చెందిన డీఐజీ సి. విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు.ఆయన శుక్రవారం తన నివాసంలోనే ప్రాణాలు తీసుకున్నారు.ప్రస్తుతం ఆయన కోయంబత్తూర్ సర్కిల్ (Coimbatore Circle)లో డీఐజీ హోదాలో పనిచేస్తున్నారు. ఆ నగరానికి చెందిన రెడ్‌ఫీల్డ్స్‌లోని క్వార్టర్స్‌లో తన కుటుంబంతో కలిసి ఆయన నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారని సమాచారం. తీవ్ర ఒత్తిడే ఆయన మరణానికి కారణమని తెలుస్తోంది. పోస్ట్‌మార్టం నిమిత్తం కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు మృతదేహాన్ని తరలించారు. ఈ ఏడాది జనవరి నుంచి విజయ్ కుమార్ డీఐజీ హోదాలో పనిచేస్తున్నారు.
బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, బైకును ఈడ్చుకుంటూ పోయిన బీఎండబ్ల్యూ కారు, వీడియో ఇదిగో..
డీఐజీ మృతిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ‘డీఐజీ విజయ్ కుమార్ మృతి మాకు తీరని లోటు. గతంలో ఆయన ఎస్పీగా ఉంటూనే ఇతర బాధ్యతలు నిర్వర్తించారు. తమిళనాడుకు గౌరవం తీసుకొచ్చారు’ అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఆయన 2009 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన కాంచీపురం, కడలూరు, నాగపట్టణం, తిరువూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. కోయంబత్తూర్ సర్కిల్‌కు రాకముందు చెన్నైలో డీసీపీగా విధులు నిర్వర్తించారు.