Firecrackers (Photo Credits: PTI)

దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ కాలుష్యం దృష్ట్యా బాణసంచా క్రయవిక్రయాలు, ఉపయోగించటంపై నిషేధం విధించింది. ఫైర్‌క్రాకర్స్‌ కొనుగోలు చేసినా, కాల్చినా రూ.200 జరిమానా విధించటంతో పాటు.. 6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మీడియా సమావేశంలో ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ ప్రకటన చేశారు. బాణసంచా తయారీ, నిలువ, విక్రయాలు జరపటం నేరమని తెలిపారు. అందుకు రూ.5000 వరకు జరిమానా, పేలుడు పదార్థాల సెక్షన్‌ 9బీ ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో టపాసులు పేల్చడంపై ఆంక్షలు, రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య టపాకులను కాల్చాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలు, గాలి కాలుష్యాన్ని 15-20 శాతం తగ్గించాలనే లక్ష్యంతో మార్గదర్శకాలు జారీ

అక్టోబర్‌ 21న ‘ దీపాలు వెలిగించండి.. పటాకలు కాదు’ అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు రాయ్‌. వచ్చే శుక్రవారం సెంట్రల్‌ పార్క్‌ వద్ద 51వేల దీపాలు వెలిగిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఫైర్‌క్రాకర్స్‌ తయారు చేయటం, విక్రయించటం సహా అన్నింటిపై జనవరి 1 వరకు నిషేధం విధించింది ఢిల్లీ ప్రభుత్వం. అందులో దీపావళికి సైతం ఎలాంటి మినహాయింపునివ్వలేదు. గత రెండేళ్లుగా ఇదే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.