Bengaluru, December 21: ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే రాజకీయ నాయకులు అప్పుడప్పుడూ ఆటవిడుపు కోసం సరదాగా ఏవైనా ఆటలు ఆడుతుంటారు. కొద్ది పాటి సమయం దొరికితే తమ ముచ్చటను ఆ విధంగా తీర్చుకుంటుంటారు. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ లీడర్ డికే శివకుమార్ (Senior Congress leader DK Shivakumar) కూడా క్రికెట్ బ్యాటు పట్టారు. ఆయన క్రికెట్ ఆడుతున్న వీడియోని ప్రముఖ వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ ((ANI) ట్వీట్ చేసింది.
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ శనివారంనాడు ఆటవిడుపుగా పాత్రికేయులతో కలిసి క్రికెట్ (Cricket)ఆడారు. టెన్నిస్ బాల్‌ను బౌండ్రీలు దాటిస్తూ కాసేపు బ్యాటింగ్ చేశారు ఆ తర్వాత మరి కాసేపు బౌలింగ్ చేస్తూ తన ముచ్చట తీర్చుకున్నారు.
కనకపురాకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యుడు శివకుమార్ మనీలాండరింగ్ కేసులో(Money Laundering Act (PMLA) 2002) అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు రూ.25 లక్షల పూచీకత్తుతో శివకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని శివకుమార్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దాదాపు 50 రోజుల వరకు శివకుమార్ జైల్లోనే ఉన్నారు.
DK Shivakumar Playing Cricket in Bengaluru:
#WATCH Karnataka: Senior Congress leader DK Shivakumar plays cricket with media persons in Bengaluru. pic.twitter.com/nxsfyU4y0L
— ANI (@ANI) December 21, 2019
కాగా పౌరసత్వ సమవరణ చట్టంపై రాష్ట్రంలో తలెత్తిన నిరసనలు హింసకు దారితీయడంపై ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై శివకుమార్ విమర్శలు గుప్పించారు. 'రాష్ట్రంలోని ప్రజల వాణిని అణగదొక్కుతున్నారు. ప్రజా హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను తాము ఏమీ అనదలచుకోలేదని, ప్రభుత్వం ఆదేశించినట్టుగానే వాళ్లు చేస్తుంటారని, రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు ముఖ్యమంత్రి, హోం మంత్రే బాధ్యులని డీకే అన్నారు.