Doctor

New Delhi, May 1: ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోవిడ్ మరణాలను చూసి తట్టుకోలేని ఓ డాక్టర్ ఆత్మహత్య (Doctor Dies By Suicide) చేసుకున్నాడు. విషాద ఘటన వివరాల్లోకెళితే.. ఢిల్లీలో మ్యాక్స్ ప్రైవేట్‌ ఆసుపత్రిలో (Max Hospital in Delhi) కొవిడ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న వివేక్‌ రాయ్‌ (Doctor Vivek Rai) అనే వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని ‘ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ)’ మాజీ చీఫ్‌ డాక్టర్‌ రవి వంఖేడ్కర్‌ (Prof Dr Ravi Wankhedkar) ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

ఆయన కళ్లెదుటే కోవిడ్ మరణాలు కనిపిస్తుండటంతో ఒత్తిడి తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. కాగా కరోనావైరస్ నుంచి ఆయన వందలాది మంది ప్రాణాల్ని కాపాడారని డాక్టర్‌ రవి వంఖేడ్కర్‌ తెలిపారు.

మళ్లీ మే 10 దాకా లాక్‌డౌన్ పొడిగింపు , కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆక్సిజన్ కొరతపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రతిరోజు విషమ పరిస్థితుల్లో ఉన్న కనీసం ఆరు నుంచి ఏడు మందికి రాయ్‌ దగ్గరి నుంచి చికిత్స అందించేవారని వంఖేడ్కర్‌ తెలిపారు. కానీ, మహమ్మారితో తన కళ్ల ముందే అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే తట్టుకోలేకే ఒత్తిడిలోకి జారుకున్నాడని తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యవస్థపై డాక్టర్‌ వంఖేడ్కర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. రాయ్‌ది వ్యవస్థ చేసిన హత్య అని ఆరోపించారు. కనీస వైద్య సౌకర్యాల కొరత, ఔషధాల లేమి, అశాస్త్రీయ విధానాలు, అనవసర రాజకీయాలు, అసమర్థ పాలన వల్లే వైద్యుల్లో నిరాశ పెరిగి ఒత్తిడిలోకి జారకుంటున్నారని ఆరోపించారు.

Here's Prof Dr Ravi Wankhedkar Tweets

Here's actress  Nagma Tweet

డాక్టర్ వివేక్ రాయ్ గత ఒక నెల నుండి ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్ రోగులను చూసుకుంటున్నారని మాజీ ఐఎంఎ చీఫ్ తెలిపారు. కరోనా నుంచి పేషెంట్లను కాపాడే ప్రయత్నంలో వారి బాధలు, భావోద్వేగాలను చూడలేక..తానే జీవితం చాలించడం మేలని అనుకున్నాడని వంఖేడ్కర్‌ ట్వీట్ లో తెలిపారు. కాగా ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ కి భార్య ఉంది. ఆమె రెండు నెలల గర్భవతి.

కర్నూలులో దారుణం, ఆక్సిజన్‌ అందక అయిదుగురు కరోనా పేషెంట్లు మృతి, అనుమతి లేకుండా ప్రైవేట్ ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స చేస్తున్నట్లు నిర్ధారణ, సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం

ఈ ఆత్మహత్య అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. డాక్టర్లు కోవిడ్ కల్లోలంలో ఎంత ఒత్తిడితో పనిచేస్తున్నారో తెలియజేస్తుంది. వారు ఎంతగా మానసిక ఒత్తిడితో లోనవుతారో ఈ ఘటన కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.