Kochi, July 27: హెల్మెట్ లేకపోతే ట్రాఫిక్ పోలీసుల ఫైన్ వేస్తారని మనందరికీ తెలుసు! అంతేకాదు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పొల్యూషల్ లేకపోతే కూడా ఫైన్ వేయవచ్చు. కానీ కేరళలో ఓ ట్రాఫిక్ పోలీసు విధించిన చలాన్ చూసి వాహనదారుడికి కళ్లుతిరిగాయి. బైక్‌లో (bike) సరిపడా పెట్రోల్ లేదనే కారణంతో రూ. 250 చలాన్ వేశాడు. ఇందుకు సంబంధించిన ఈ-చలానాను (E challan) సందరు వాహనదారుడు కేరళ ట్రాఫిక్ పోలీసులు (Kerala traffic police) పంపిన ఈ-చలాన్ చిత్రాన్ని తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు ట్రాఫిక్ పోలీసుల తీరుపై సెటైర్లు వేస్తున్నారు. వాహనదారుడు ఐటీ ఉద్యోగి బాసిల్ శ్యామ్ (basil shyam). తన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఓ ప్రాంతంలో వన్ వేలో ప్రయాణిస్తుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్ ఆపి రూ. 250 చలాన్ విధించారు.

తన ఆఫీస్ కు వెళ్లిన తరువాత ఈ-చలానాలో (E challan) ఏముందోనని చూశాడు. దీంతో శ్యామ్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వాహనంలో ఇందనం లేకుండా ప్రయాణికులతో వెళ్తున్న నేరానికి జరిమానా అని ఆ రసీదులో ఉంది. దీన్ని అతడు తన ఫేస్ బుక్ ఖాతాలో (Facebook) పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.

Railway Concessions: సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్‌న్యూస్, ట్రైన్లలో రాయితీలు పునరుద్దరిస్తున్నట్లు ప్రకటన, వయోపరిమితిని మాత్రం పెంచిన కేంద్రం, మరికొన్ని నిబంధనలు పెడుతూ ప్రకటన 

కేరళ రవాణా చట్టంలోని నిబంధనల ప్రకారం.. వాణిజ్య వాహనాలు, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే కారు, బస్సు, ఆటో వంటి వాహనాలు ఇందనం లేకుండా ఆగిపోతే డ్రైవర్, యాజమానికి రూ. 250 జరిమానా విధించే అవకాశం మాత్రం ఉంది. దీంతో ట్రాఫిక్ పోలీస్.. రాంగ్ రూట్ అని నమోదు చేయకుండా పొరపాటున ఇంధన తక్కువగా ఉందని చలానా విధిస్తున్నట్లు పేర్కొని ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తానికి ట్రాఫిక్ పోలీస్ విధించిన వింత జరిమానా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.