New Delhi, July 27: కరోనా సమయంలో రైళ్లలో అన్ని రకాల రాయితీలను (Concessions) క్యాన్సిల్ చేసిన ప్రభుత్వం...తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు చక్కబడటంతో వృద్ధులకు రైల్వే టికెట్లపై రాయితీని(ticket Concessions) పునరుద్దరించనున్నట్లు ప్రకటించింది. అయితే గతంలో ఉన్నరూల్స్ కు (Rules) కొన్ని మార్పులు చేసింది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini vishnav) పార్లమెంట్ లో ప్రకటన చేశారు. నూతన నిబంధనల ప్రకారం రెల్వే శాఖ వృద్ధులకు రాయితీ వయసు 58 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచింది. వృద్ధులకు జనరల్ (Genaral), స్లీపర్ క్లాస్ (Sleeper class) లోనే టికెట్ రాయితీ వర్తింపజేయనుంది. కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి రైల్వేలో పలు రాయితీలను ఎత్తివేసింది. ఆ తర్వాత కొన్ని రాయితీలను పునరుద్ధరించినప్పటికీ వృద్ధులకు రాయితీని మాత్రం పునరుద్ధరించలేదు. దీన్ని పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రాయితీలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్ లో కీలక ప్రకటన చేశారు.
వృద్ధులకు రాయితీ పునరుద్ధరించే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే శాఖ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారికి ముందు 58 సంవత్సరాలు దాటిన మహిళలకు, 60 సంవత్సరాలు దాటిన పురుషులకు రాయితీ వర్తింపజేసేవారు. మహిళలకు 50 శాతం, పురుషులకు 40 శాతం టికెట్ లో రాయితీ ఇచ్చేవారు. అయితే ఇకనుంచి 70 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే రాయితీ ఇవ్వాలని రైల్వే శాఖ యోచిస్తుందని తెలుస్తోంది. అదికూడా కేవలం నాన్ ఏసీ తరగతులకే పరిమితం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు రైల్వే తన ఆదాయం పెంచుకునేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని రైళ్లలోనూ ప్రీమియ తత్కాల్ కోటాను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 రైళ్లల్లో మాత్రమే ప్రీమియం తత్కాల్ కోటా అమలు కానుంది. ఈ పథకం కింద కొన్ని టికెట్లను కేటాయిస్తారు. వీటికి డైనమిక్ ఫేర్ అమలు అవుతుంది. తత్కాల్ కోటాతో పోలిస్తే ఈ టికెట్లు కాస్త ఖరీదుగానే ఉంటాయి. సీట్లు భర్తీ అవుతున్న కొద్దీ టికెట్ ధర పెరుగుతూవుంటుంది. చివరి నిమిషంలో బుక్ చేసుకున్న వారిపై మాత్రం మరింత భారం పడనుంది.