Draupadi Murmu Oath Ceremony: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవీ బాధ్యతలు, ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించిన సీజేఐ ఎన్వీ రమణ

భారత దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం చేశారు, భారత దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమె చేత ప్రమాణం చేయించారు. అనంతరం పదవీ పత్రాలపై ఆమె సంతకాలు చేశారు.అంతకుముందు రామ్‌నాథ్‌ కోవింద్‌, ద్రౌపది ముర్ము పార్లమెంట్‌కు చేరుకున్నారు.

Draupadi Murmu Oath Ceremony: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవీ బాధ్యతలు, ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించిన సీజేఐ ఎన్వీ రమణ
Droupadi Murmu Takes Oath. (Photo Credits: ANI)

భారత దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం చేశారు, భారత దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమె చేత ప్రమాణం చేయించారు. అనంతరం పదవీ పత్రాలపై ఆమె సంతకాలు చేశారు.అంతకుముందు రామ్‌నాథ్‌ కోవింద్‌, ద్రౌపది ముర్ము పార్లమెంట్‌కు చేరుకున్నారు. వారి వెంట సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు.

ముర్ముకు త్రివిధ దళాల బృందం గన్‌ సెల్యూట్‌ చేసింది. రాష్ట్రపతి ఫోర్‌కోర్టులో రామ్‌నాథ్‌ కోవింద్‌, ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరించారు.తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ 1950 జనవరి 26న ప్రమాణం చేశారు. అయితే.. 1977 తర్వాత జూలై 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న పదో రాష్ట్రపతిగా ముర్ము చరిత్రలో నిలిచిపోనున్నారు. నీలం సంజీవరెడ్డి ఆరవ రాష్ట్రపతిగా 1977 సంవత్సరం జూలై 25న ప్రమాణం చేశారు.

ద్రౌపది ముర్ము జీవితమంతా విషాదాలే, భర్తతో పాటు ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్నా చెదరని ధైర్యం, టీచర్ నుండి రాష్ట్రపతి దాకా ద్రౌపది ముర్ము జీవిత ప్రస్థానం ఇదే..

64 ఏళ్ల ఒడిశా ట్రైబల్ లీడర్ ( Tribal Leader ).. తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్ (Mayur bhanj) జిల్లాలో జన్మించారు. శ్యామ్ చరణ్ ముర్మును వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అయితే భర్త, కుమారులు ఇద్దరూ చనిపోవడంతో ఆమె జీవితంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఆ తర్వాత ప్రజాసేవకే ఆమె జీవితాన్ని అంకితం చేశారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన మరియు గిరిజన సంఘం నుండి వచ్చిన ముర్ము ఉపాధ్యాయురాలిగా ప్రారంభించి ఒడిశా రాజకీయాల్లోకి ప్రవేశించారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో కొత్త చరిత్ర, సగానికి పైగా ఓట్లతో విజయదుంధుబి మోగించిన ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా రికార్డు

 1997లో రాయ్‌రంగాపూర్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మోర్చా ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు.. రాయ్‌రంగాపూర్ నియోజకవర్గం నుంచే 2000వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశాలో బీజేపీ, బీజేడీ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో వాణిజ్య, రవాణా శాఖలతోపాటు ఫిషరీస్ అండ్ యానిమల్ రిసోర్సెస్ విభాగాల మంత్రిగా సేవలు అందించారు. 2000 నుంచి 2004 వరకు మంత్రి పదవిలో కొనసాగిన ఆమె.. 2015లో జార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా (Jarkhand Governor) ప్రమాణ స్వీకారం చేశారు. వివాద రహితురాలిగా పేరున్న ద్రౌపదికి.. జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు అధికార పక్షమే కాకుండా ప్రతిపక్ష నేతల నుంచి కూడా మన్ననలు పొందారు.
దేశ అత్యున్న‌త పదవిని చేపట్టిన ద్రౌప‌ది ముర్ము త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల‌ను, విషాదాల‌ను ఎదుర్కొన్నారు. 2009లో అనుమానాస్ప‌ద ప‌రిస్థితుల్లో ఒక కుమారుడు మ‌ర‌ణించాడు. ఈ విషాదం నుంచి తెరుకునే లోపే, 2012లో రోడ్డు ప్ర‌మాదంలో మ‌రో కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. భ‌ర్త శ్యామ్ చ‌ర‌ణ్ ముర్ము గుండెపోటుతో మ‌ర‌ణించారు. భర్త, కొడుకులను కోల్పోయిన ద్రౌపది మిగిలిన ఏకైక కూతురు ఇతిశ్రీనే అన్నీ. కూతురుకు వివాహమై ఒక పాప కూడా ఉంది. తీరిక చిక్కినప్పుడల్లా చిన్నారి మనవరాలితో ఆడుకుంటారు ద్రౌపది ముర్ము

(The above story first appeared on LatestLY on Jul 25, 2022 10:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).