Earthquake Helmets Japan MPs' Disaster Helmet Drill Sparks Twitter Debate (Photo-Twitter)

Tokyo, December 1: జపాన్ పార్లమెంట్‌(Japan Parlment)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్పీకర్, ఎంపీలు తలకు హెల్మెట్లు (Earthquake Helmets) ధరించారు. దీనికి కారణం ఏంటంటేతమను తాము భూకంపాల నుంచి రక్షించుకోవాడానికేనని వారు చెబుతున్నారు. జపాన్‌ ని భూకంపాల దేశం (Earthquake Country) అని కూడా అంటుంటారు దీనికి ప్రధాన కారణం అక్కడ తరచుగా భూకంపాలు ఏర్పడుతుండటమే. ఈక్రమంలో ఎంపీలు ఆత్మరక్షణ కోసం పాటించాల్సిన నియమాలను సభలో చర్చ నిర్వహించారు.

దానికి సంబంధించి ఇటీవల ఎర్త్‌కేక్ డ్రిల్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ తడమోరీ ఒషిమా మాట్లాడుతూ.. పార్లమెంటులో సభ జరుగుతున్నప్పుడు ప్రమాదం జరిగితే..ఏం టెన్షన్ పడొద్దు..మీ డెస్కుల్లో హెల్మెట్లు ఉన్నాయి వెంటనే వాటిని పెట్టేసుకోండి..అని చెప్పారు. దీంట్లో భాగంగా..స్పీకర్ తన దగ్గర ఉన్న హెల్మెట్ ను పెట్టుకున్నారు. తరువాత సభలోని ఎంపీలంతా తమ డెస్కుల్లో ఉన్న హెల్మెట్లను పెట్టుకున్నారు.

Earthquake Helmets

కాగా జపాన్ పార్లమెంటులో ప్రమాదాల వల్ల ప్రజా ప్రతినిధులకు ఎటువంటి ప్రమాదం ఏర్పడకుండా ఉండేందుకు 2017న సేఫ్టీ కిట్స్ ను కూడా పార్లమెంట్ అందుబాటులోకి తెచ్చారు. ఈ కిట్‌లో తాజాగా ఫోల్డింగ్ హెల్మెట్‌ను కూడా చేర్చారు. ఈ విషయాన్ని స్పీకర్ ఎంపీలకు తెలిపిన సందర్భంగా ఇలా అందరూ హెల్మెట్లను పెట్టుకున్నారు, ఫోల్డ్ చేసే ఫెసిలిటీ ఉన్న ఈ హెల్మెట్లను బ్యాగుల్లో కూడా పెట్టేసుకోవచ్చు. భూకంపం రాగానే వాటిని తెరిచి తలకు పెట్టేసుకుంటే చాలు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.