New Delhi, Jan 5: జపాన్‌లో సోమవారం సంభవించిన పెను భూకంపం (Earthquake in Japan) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ భూకంపం కారణంగా 64 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన 64 మంది కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు ప్రధాని మోదీ లేఖ (PM Narendra Modi Writes to Japanese Counterpart Fumio Kishida రాశారు. భూకంపం గురించి తెలియగానే తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆ లేఖలో తెలియజేశారు.
జనవరి 1, 2024 న జపాన్‌ను తాకిన భారీ భూకంపం గురించి తెలుసుకోవడం తనకు చాలా బాధగా, ఆందోళనగా ఉందని జపాన్ ప్రధానికి పిఎం మోడీ చెప్పారు.ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. విపత్తు కారణంగా నష్టపోయిన జపాన్,ఆ దేశ ప్రజలకు మేము సంఘీభావంగా ఉంటాము" అని ప్రధాని మోదీ జోడించారు.
ప్రత్యేక వ్యూహాత్మక ప్రపం,చ భాగస్వామిగా, భారతదేశం జపాన్‌తో తన సంబంధానికి విలువనిస్తుంది. సాధ్యమైన అన్ని సహాయ సహకారాల్ని అందించడానికి సిద్ధంగా ఉంది" అని కూడా పిఎం మోడీ అన్నారు. సెంట్రల్ జపాన్‌లోని నోటో ద్వీపకల్పం, పరిసర ప్రాంతాల్లో సోమవారం సంభవించిన 7.5 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో కనీసం 64 మంది మరణించినట్లు క్యోడో న్యూస్ నివేదించింది.
మరో 250 మంది గల్లంతయ్యారు. ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూకంపం కారణంగా ఇషికావా ప్రిఫెక్చర్‌లోని వాజిమా నగరంలో నిర్మాణ నష్టం, మంటలు సంభవించాయి. అయితే, శక్తివంతమైన భూకంపం వల్ల సంభవించిన విపత్తు నష్టం పూర్తి స్థాయిలో ఇంకా తెలియదు.