New Delhi, March 16: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు (Kavita Husband Anil) ఈడీ నోటీసులు (ED Notice) జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ కొద్దిసేపటికే కవిత భర్తకు నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అలాగే, కవిత పీఆర్వో రాజేశ్‌తో పాటు ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులు పంపింది.
కవిత ఇంట్లో సోదాలు చేసిన వేళ ఐదుగురి సెల్‌ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈడీ కస్టడీలో కవితను కలిసేందుకు తొమ్మిది మందికి అనుమతి దక్కింది. అందులో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే, కవితను కలిసేందుకు ముగ్గురు పీఏలు, ఇద్దరు న్యాయవాదులకు అనుమతి దక్కింది.