Delhi Shocker: ఇంత దారుణమా..వృద్దురాలి గొంతుకోసి అత్యాచారం, ఆపై 20 సార్లు కత్తితో పొడిచిన కసాయి, ఢిల్లీలో దారుణ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

దేశ రాజధాని ఢిల్లీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 62ఏళ్ల వృద్దురాలిపై లైంగిక దాడికి (Elderly Woman Sexually Assaulted) పాల్పడ్డంతో పాటు, ఆమెను గొంతుకోసి చంపేయడం అక్కడ కలకలం రేపింది. నిందితుడు మహిళను 20 సార్లు పొడిచి చంపాడని ( Stabbed Multiple Times) పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.

Delhi Shocker: ఇంత దారుణమా..వృద్దురాలి గొంతుకోసి అత్యాచారం, ఆపై 20 సార్లు కత్తితో పొడిచిన కసాయి, ఢిల్లీలో దారుణ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Image used for representational purpose only | (Photo Credits: PTI)

New Delhi, June 15: దేశ రాజధాని ఢిల్లీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 62ఏళ్ల వృద్దురాలిపై లైంగిక దాడికి (Elderly Woman Sexually Assaulted) పాల్పడ్డంతో పాటు, ఆమెను గొంతుకోసి చంపేయడం అక్కడ కలకలం రేపింది. నిందితుడు మహిళను 20 సార్లు పొడిచి చంపాడని ( Stabbed Multiple Times) పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.

దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే... బిహార్‌లోని బెగుసరాయ్‌కి చెందిన మహిళ (Elderly woman) ఢిల్లీలో దల్లుపురాలో తన మనవడితో కలిసి నివసిస్తోంది. మనవడు ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, ఆమె స్థానికంగా కూరగాయల విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. మనవడు ఇంట్లో లేని సమయం చూసి ఇంట్లో జొరబడ్డ నిందితుడు ఆమెపై ఎటాక్‌ చేశాడు. లైంగిక దాడికి తెగబడ్డాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కత్తితో 20 సార్లు పొడిచి పారిపోయాడు.

దీంతో వృద్దురాలు అక్కడికక్కడే మృతి చెందింది. గొంతు, కడుపులో పదునైన గాయాలున్నాయనీ, పోలీసు అధికారి ప్రియాంక కశ్యప్ చెప్పారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. విచారణ సమయంలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడనీ, కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ప్రియుడితో రాసలీలలు, మద్యం మత్తులో ఉన్న భర్త మెడకు చున్నీ బిగించి ప్రియుడుతో కలిసి చంపేసిన భార్య, గుండెపోటుతో మరణించాడని కట్టు కథలు, నిజం తెలియడంతో ఇద్దరూ పరార్

న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదైంది. దర్యాప్తులో మహిళ నివాసం ఉన్న ప్రాంతం యొక్క సిసిటివి ఫుటేజీని పోలీసులు విశ్లేషించారు. నిందితుల గుర్తించిన తరువాత అతన్ని అరెస్టు చేశామని డిసిపి చెప్పారు. కాగా విచారణ సమయంలో, నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు, ఈ సంఘటన సమయంలో అతను మత్తులో ఉన్నట్లు నిందితుడు పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి పంపినట్లు పోలీసులు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Jun 15, 2021 02:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).