Nalgonda Shocker: ప్రియుడితో రాసలీలలు, మద్యం మత్తులో ఉన్న భర్త మెడకు చున్నీ బిగించి ప్రియుడుతో కలిసి చంపేసిన భార్య, గుండెపోటుతో మరణించాడని కట్టు కథలు, నిజం తెలియడంతో ఇద్దరూ పరార్

భర్త మద్యానికి బానిస కావడంతో భార్య తన పాత ప్రేమయానాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఈ విషయం తెలిసిన భర్త తన భార్యను హెచ్చరించగా అతనిపై కక్ష పెంచుకున్న ఇద్దరూ మెడకు చున్నీ బిగించి (wife killed her husband with her lover) చంపేశారు.

Nalgonda Shocker: ప్రియుడితో రాసలీలలు, మద్యం మత్తులో ఉన్న భర్త మెడకు చున్నీ బిగించి ప్రియుడుతో కలిసి చంపేసిన భార్య, గుండెపోటుతో మరణించాడని కట్టు కథలు, నిజం తెలియడంతో ఇద్దరూ పరార్
Image used for representational purpose (Photo Credits: Pixabay)

Nalgonda, June 14: భర్త మద్యానికి బానిస కావడంతో భార్య తన పాత ప్రేమయానాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఈ విషయం తెలిసిన భర్త తన భార్యను హెచ్చరించగా అతనిపై కక్ష పెంచుకున్న ఇద్దరూ మెడకు చున్నీ బిగించి (wife killed her husband with her lover) చంపేశారు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లాలో మేళ్లచెరువు మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐ శివరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కందిబండ గ్రామానికి చెందిన ముళ్లగిరి నాగరాణి అదే గ్రామానికి చెందిన మేరిగ నవీన్‌ అనే వ్యక్తితో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఈ విషయం తన భర్త ముత్యాలు (28) కి తెలిసి పలుమార్లు మందలించాడు. కాగా.. తమకు అడ్డు తగులుతున్నాడని (interfering their Affairs in Telangana) భావించి ప్రియుడు నవీన్‌తో కలిసి భర్త ముత్యాలును హత్య చేసేందుకు పథకం రచించారు. ఈ నెల 7న ముత్యాలు కూలీ పనులకు వెళ్లి వచ్చి మద్యం సేవించి తన ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 11:30 గంటల సమయంలో భార్య, ఆమె ప్రియుడు కలిసి ముత్యాలు మెడకు చున్నీ బింగించి గట్టిగా లాగి హత్యచేశారు. ఏమీ తెలియనట్లుగా ఉదయం తన భర్త గుండెపోటుతో మరణించినట్లు అందరిని నమ్మించి అంతక్రియలు జరిపించింది.

మూగ యువతిపై తెగబడిన కామాంధులు..దారుణంగా అత్యాచారం, తండ్రికి సైగలతో చెప్పుకుని భోరున విలపించిన యువతి, మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కాగా ముత్యాలు మృతిపై కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా హత్య చేసినట్లు ఒప్పుకొని అక్కడి నుంచి పారిపోయింది. మృతుడి సోదరుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహానికి ఆదివారం తహసీల్దార్‌ దామోదర్‌రావు, సీఐ శివరామిరెడ్డి సమక్షంలో పంచనామా నిర్వహించారు. కాగా మృతుడి భార్య ఆమె ప్రియుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న వారిని త్వరలో అరెస్టు చేస్తామని ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు

(The above story first appeared on LatestLY on Jun 14, 2021 12:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).