
New Delhi, July 23: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా పలు స్థానాల్లో జరగాల్సిన లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా (EC Defers By-polls in 7 States) వేసింది. కరోనా వైరస్, వరదల నేపథ్యంలో అసెంబ్లీ స్థానాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా వేసినట్లు గురువారం ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించింది. నెగిటివ్ వచ్చిన 12 మందికి మళ్లీ పాజిటివ్, మధ్యప్రదేశ్ గవర్నరు అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రికి కరోనా, మణిపూర్‌లో మళ్లీ పూర్తిస్థాయి లాక్ డౌన్, దేశంలో 12 లక్షల దాటిన కోవిడ్-19 కేసులు
దీంతో ఆరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ ఉప ఎన్నికలు సెప్టెంబర్ 7 వరకు నిర్వహించాల్సింది. తాజాగా ఎన్నికల సంఘం ప్రకటనతో అస్సాం, కేరళ, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి.
దేశంలో గత వారం రోజులుగా 32 వేలకు పైగా పాజటివ్ కేసులు (Coronavirus cases in India) నమోదవుతున్నాయి. నిన్న 37 వేలకుపైచిలుకు కరోనా కేసులు నమోదవగా, ఈరోజు రికార్డు స్థాయిలో 45 వేలకుపైగా మంది కరోనావైరస్ బారినపడ్డారు. భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 45,720 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య (COVID-19 in India) 12,38,635కు చేరింది. అదేవిధంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,26,167 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 7,82,606 మంది బాధితులు కోలుకున్నారు.