Election Commission of India. File Image. (Photo Credits: PTI)

New Delhi January 08: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(5 States Assembly Elections) షెడ్యూల్ కసరత్తు పూర్తయింది. ఇవాళ మధ్యాహ్నం 3.30 కి షెడ్యూల్ ప్రకటించనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఉత్తరప్రదేశ్(Uttarapradesh), పంజాబ్(Punjab), గోవా(Goa), ఉత్తరాఖండ్(Uttarakhand), మణిపూర్(Manipur) రాష్ట్రాల అసెంబ్లీల గడువు ముగియనుండటంతో ఎన్నికల నిర్వహణపై కసరత్తు పూర్తి చేశారు. సీఈసీ సుశీల్ చంద్ర(CEC Sushil chandra) నేతృత్వంలో ఓ బృందం ఇటీవ‌ల యూపీ(UP)లో పర్య‌టించింది. అక్కడ రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

రాజ‌కీయ పార్టీలన్నీ షెడ్యూల్ ప్ర‌కారం అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోరడంతో ఏర్పాట్లు చేశారు. ఒక‌వైపు క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారా లేక ఆల‌స్యం చేస్తారా అన్న సందేహాలు వ్య‌క్తం అయ్యాయి. అయితే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగానే ఉన్న సంద‌ర్భంగా షెడ్యూల్ ప్ర‌కార‌మే ఎన్నిక‌ల నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల సంఘం సుముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే నిబంధనల్లో పలు మార్పులు చేసే అవకాశముంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఖర్చును పెంచిన ఈసీ... కరోనా వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్ ను కూడా తప్పనిసరి చేసే అవకాశముంది.